టీమిండియాను కరోనా మహమ్మారి కలవరపెడుతోంది. విరాట్ కోహ్లీ నేతృత్వంలో ఇంగ్లండ్ వెళ్లిన టీమిండియా ఆటగాళ్లలో ఒకరికి కరోనా సోకిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. గొంతునొప్పితో బాధపడుతున్న ఆ ఆటగానికి కరోనా టెస్ట్ నిర్వహించగా.. పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టుగా సమాచారం. దీంతో ఆ ఆటగానితో సన్నిహితంగా మెలిగినవారిని ఇప్పటికే మూడు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచినట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ఇంగ్లండ్‌లో డెల్టా వేరియెంట్ డేంజరస్‌గా మారింది. ఈ క్రమంలోనే ముందు జాగ్రత్తగా ఆటగాళ్లకు కరోనా టెస్టులు నిర్వహించగా.. బయటపడింది.
బయో బబుల్ నుంచి బయటకు వచ్చిన ఆ ఆటగాడు.. ప్రస్తుతం ఇంగ్లండ్‌లోని తన సన్నిహితుడి ఇంటిలో హోమ్ క్వారంటైన్‌లో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు భారత్ జట్టు.. ఓ ప్రాక్టిస్ మ్యాచ్ ఆడనుంది. దుర్హమ్‌లో కౌంటీ ఛాంపియన్‌ఫిప్-XI జట్టుతో తలపడనుంది.
ఇటీవల ఇంగ్లండ్ టీంలో కూడా ఏకంగా ఏడుగురిలో కరోనా వైరస్ బయటపడింది. పాకిస్తాన్‌తో వన్డే సిరీస్ సమయంలో ఇది చోటు చేసుకుంది. పైగా వారందరిలోనూ డెల్టా వేరియెంట్ కరోనానే బయటపడింది.
This post was last modified on July 15, 2021 10:45 am
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…