కరోనా కి మన దేశంలో వ్యాక్సిన్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ వేసుకున్న వారు.. కరోనా సోకినా కూడా.. దానిపై పోరాడేందుకు సహాయం చేస్తుంది. అయితే.. ఓ మహిళ విషయంలో మాత్రం.. ఈ కరోనా వ్యాక్సిన్ అద్భుతం చేసింది.
వృద్ధాప్యం కారణంగా కంటి చూపు కోల్పోయి బాధపడుతున్న ఓ మహిళకు కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత కంటి చూపు తిరిగి వచ్చింది. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లా బెందర్ వాడి గ్రామానికి చెందిన మధురాబాయి బిద్వే అనే 70 ఏళ్ల వృద్ధురాలికి కంటిశుక్లం వల్ల 9ఏళ్ల క్రితం చూపు కోల్పోయింది.మధురాబాయి జాల్నా జిల్లా పార్టూర్ నివాసి. ఆమె తన బంధువులతో కలిసి రిసోడ్ తహసీల్ లో నివాసముంటోంది. కంటిశుక్లం తెల్లగా మారడంతో దృష్టి కోల్పోయి చీకటి జీవితాన్ని గడుపుతోంది. కరోనా నివారణ కోసం మధురాబాయి జూన్ 26వతేదీన కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోసు వేయించుకుంది. దీంతో తనకు 30 నుంచి 40 శాతం దాకా కంటిచూపు వచ్చిందని మధురాబాయి చెప్పారు. కోవిషీల్డ్ టీకా తీసుకున్న మరుసటి రోజు కంటిచూపు రావడంతో మధురాబాయి సంతోషంలో మునిగింది.
This post was last modified on July 6, 2021 10:06 am
దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్…
రాజా సాబ్ నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. దర్శకుడు మారుతీ లిరికల్స్ కు పరిమితం కాకుండా ఏకంగా వీడియో…
చెల్లెలికి బర్త్‌డే విషెస్ చెప్పని అన్న… వినడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! పాలిటిక్స్‌లో అది ఎవరై ఉంటారు? అని ఎవరైనా…
సినిమాల్లో కంటెంట్ ఎలా ఉందన్న దాని కంటే.. ఆ సినిమా టీంలో ముఖ్యమైన వ్యక్తుల మాటతీరును, నడవడికను బట్టి కూడా సినిమాకు ఓపెనింగ్స్…
తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే.…
అఖండ 2 తాండవంతో గత వారం గడిచిపోయాక ఇప్పుడు మూవ్ లవర్స్ చూపు కొత్త ఫ్రైడే మీదకు వెళ్తోంది. బాలయ్య…