ఇది దారుణం. దారుణాతి దారుణం. తన కూతురికి బలవంతపు పెళ్లి చేసి అత్తారింటికి పంపిన ఓ తండ్రి.. అక్కడ ఉండలేక తన కూతురు పారిపోయిందని తెలిసి ఆమె పట్ల అత్యంత కిరాతకంగా వ్యవహరించాడు. ఆమెపై తన కొడుకులు, ఇతర బంధువులతో కలిసి పాశవిక దాడికి పాల్పడ్డాడు. కన్న బిడ్డ అని కనికరం లేకుండా ఆ అమ్మాయిని ఆ తండ్రి హింసించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూసిన ప్రతి ఒక్కరికీ కడుపు తరుక్కుపోయేలా ఉందీ వీడియో. వివరాల్లోకి వెళ్తే..
మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల గిరిజన యువతికి మూడు నెలల కిందట పెళ్లి జరిగింది. ఐతే ఆ పెళ్లి ఆమెకు ఇష్టం లేదు. అయిన కష్టం మీద మూడు నెలల అత్తారింట్లో గడిపింది. తర్వాత అక్కడి నుంచి పారిపోయింది. ఐతే ఆమె ఆచూకీ కనిపెట్టి ఇంటికి తీసుకొచ్చిన తండ్రి, ఆమె సోదరులు దారుణాతి దారుణంగా ప్రవర్తించారు. నలుగురైదురు కలిసి ఆమెను చేతులతో కొడుతూ.. కాళ్లతో తంతూ దారుణంగా హింసించారు. ఇంట్లో, బయట, ఒక పొలంలో.. ఇలా వేర్వేరు ప్రదేశాల్లో ఆమెను హింసించడం వీడియోలో రికార్డయింది. ఎంతకీ కసితీరని వాళ్లు.. చివరికి ఆ అమ్మాయిని తాళ్లతో చెట్టుకు వేలాడదీసి కర్రలతో బాదడం గమనార్హం.
బక్క చిక్కి కనిపిస్తున్న ఆ అమ్మాయి దెబ్బలకు తాళ లేక బోరున ఏడుస్తున్నా.. ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు చేయనని వేడుకుంటున్నా ఎవ్వరూ కనికరించలేదు. తమాషాగా నవ్వుతూ ఆమెను చితకబాదడం.. చుట్టూ ఉన్న వాళ్లు కూడా నవ్వుతుండటం అత్యంత దారుణమైన విషయం. ఈ వీడియో సోషల్ మీడియాలోకి వచ్చి వైరల్ కావడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. ఆ యువతిని హింసించిన తండ్రి, ఇతర వ్యక్తులపై కేసులు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. ఐతే ఈ వీడియో చూసిన వాళ్లందరికీ పట్టలేని ఆగ్రహం కలుగుతోంది. దాడికి పాల్పడ్డ వారిని అత్యంత కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
This post was last modified on July 4, 2021 12:17 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…