Trends

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌పై క్లారిటీ వ‌చ్చేసింది


కొన్ని నెల‌లుగా సాగుతున్న సందిగ్ధ‌త‌కు తెర‌ప‌డిన‌ట్లే. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఎప్పుడు, ఎక్క‌డ జ‌రుగుతంద‌నే విష‌యంలో స్ప‌ష్ట‌త వ‌చ్చేసిన‌ట్లే. అనుకున్న‌ట్లే భార‌త్ నుంచి ఈ టోర్నీ త‌ర‌లిపోనుంది. యూఏఈ వేదిక‌గా ఈ మెగా టోర్నీ జ‌ర‌గ‌బోతోంది. షెడ్యూల్ ప్ర‌కారం అక్టోబ‌రు-నవంబ‌రు నెల‌ల్లో భార‌త్ వేదిక‌గా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జ‌ర‌గాల్సింది. కొన్ని నెల‌ల ముందు వ‌ర‌కు ఈ విష‌యంలో ఎవ‌రికీ సందేహాల్లేవు. కానీ క‌రోనా సెకండ్ వేవ్ దెబ్బ‌కు క‌థ మారిపోయింది.

ఐపీఎల్ మ‌ధ్య‌లో ఆపేయాల్సిన ప‌రిస్థితి త‌లెత్త‌డంతో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ మీదా సందేహాలు మొద‌ల‌య్యాయి. గ‌త కొన్ని వారాల్లో క‌రోనా ఉద్ధృతి చాలా వ‌ర‌కు త‌గ్గిన‌ప్ప‌టికీ.. థ‌ర్డ్ వేవ్ గురించి హెచ్చ‌రిక‌లు జారీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. కాగా జూన్ నెలాఖ‌రు లోపు క‌ప్పు నిర్వ‌హ‌ణ‌పై ఏదో ఒక‌టి తేల్చి చెప్పాల‌ని బీసీసీఐకి ఐసీసీ ఇప్ప‌టికే అల్టిమేటం విధించింది. గ‌డువు స‌మీపిస్తున్నా.. బీసీసీఐ ఏమీ తేల్చుకోలేని స్థితిలో ఉంది.

ఇప్పుడు కరోనా ఉద్ధృతి త‌గ్గినా.. మ‌ళ్లీ వైర‌స్ ప్ర‌భావం పెర‌గ‌ద‌ని గ్యారెంటీ లేదు. ఇంత అనిశ్చితిలో ఇంత పెద్ద టోర్నీ విష‌యంలో రిస్క్ తీసుకోలేమ‌ని బీసీసీఐ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇంకా అధికారికంగా ఐసీసీకి విష‌యం చెప్ప‌లేదు కానీ.. బీసీసీఐ కార్య‌ద‌ర్శి జై షా మాట‌ల్ని బ‌ట్టి చూస్తే టోర్నీని త‌ర‌లించ‌డం లాంఛ‌న‌మే అని తేలిపోయింది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ భార‌త్‌లో జ‌ర‌గ‌ద‌ని, యూఏఈలో నిర్వ‌హిస్తామ‌ని జై షా మీడియాకు వెల్ల‌డించాడు. త్వ‌ర‌లోనే దీనిపై ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని కూడా తేల్చేశాడు.

ఇక బోర్డు వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం అక్టోబ‌రు 17న ఈ టోర్నీ మొద‌ల‌వుతుంద‌ట‌. న‌వంబ‌రు 14న ఫైన‌ల్ జ‌రుగుతుంద‌ట‌. మ‌ధ్య‌లో ఆగిన ఐపీఎల్‌ను కూడా యూఏఈలోనే నిర్వ‌హించ‌నున్న సంగతి తెలిసిందే. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఆరంభానికి కొన్ని రోజుల ముందు ఐపీఎల్ ముగుస్తుంది. ఐపీఎల్ జ‌రిగే వేదిక‌ల్లోనే టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌నూ నిర్వ‌హించ‌నున్నారు.

This post was last modified on June 27, 2021 7:53 am

Share

Recent Posts

దాదాకున్న సమయం తక్కువే కానీ

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…

3 minutes ago

రణబాలి… దర్శకుడి క్లారిటీ సూపర్

ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…

1 hour ago

విశాఖ‌, విజ‌య‌వాడ‌, తిరుప‌తి… ఈ మూడే కూట‌మికి కీల‌కం!

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూట‌మికి కీల‌కంగా మారిన మూడు మునిసిప‌ల్‌ కార్పొరేష‌న్ల వ్య‌వ‌హారం.. ఆస‌క్తిగా మారింది. రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాదు..…

2 hours ago

ఏఐతో 100 కోట్ల ప్రాణాలకు ముప్పు?

సాంకేతిక రంగంలో పెను విప్లవానికి దారి తీస్తున్న ఏఐ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాకముందే ప్రపంచాన్ని హడలెత్తిస్తుంది. అణ్వాయుధాల కంటే…

2 hours ago

కాంగ్రెస్ వైపు జగన్ అడుగులు?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రూటు మాసరుస్తున్నారా..? నిన్నా మొన్నటి వరకు ప్రధాని మోదీకి నమ్మకమైన వ్యక్తిగా కొనసాగిన…

3 hours ago

ఉన్న కాస్త సింపతీ పోతుంది జగన్

ఒక పార్టీపై చ‌ర్య‌లు తీసుకున్నా.. ఒక పార్టీ నాయ‌కుడిపై చ‌ర్య‌లు తీసుకున్నా.. స‌హ‌జంగానే ప్ర‌జ‌ల్లో అంతో ఇంతో సింప‌తీ ద‌క్కుతుంది.…

4 hours ago