వారి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాల సమక్షంలో ఆనందంగా జరిగింది. అమ్మాయి కుందనపు బొమ్మలా ఉందని.. ఏరి కోరి మరీ పెళ్లి చేసుకున్నాడు. కానీ.. అతని ఆశలన్నీ అడియాశలు అయ్యాయి. పెళ్లి జరిగిన రెండు నెలల తర్వాత… తాను పెళ్లి చేసుకుంది ఓ అమ్మాయిని కాదని.. హిజ్రా అని తెలిసి షాకయ్యాడు. ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ లో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కాన్పూర్ నగర నివాసి అయిన యువకుడు శాస్త్రినగర్ లోని పంకి ప్రాంతానికి చెందిన యువతిని ఏప్రిల్ 28వతేదీన వివాహమాడారు. వివాహం అనంతరం వధూవరులకు తొలిరేయి ఏర్పాటు చేశారు. అయితే.. వారి మధ్య బంధం ఏర్పడలేదు. ఆ తర్వాత వరుడు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలించడం లేదు. దీంతో.. సమస్య ఏంటో తెలుసుకోవడానికి భార్యను గైనకాలజిస్ట్ వద్దకు తీసుకువెళ్లాడు.
అక్కడ పరిశీలించిన వైద్యులు… ఇటీవలే ఆమెకు లింగ మార్పిడి జరిగిందని.. కాబట్టి.. ఇంకా జననాంగాలు పూర్తిగా అభివృద్ధి చెందలేదని.. అసలు విషయం చెప్పేశారు. అంతే.. ఆ వార్త విని అతను షాకయ్యాడు.
తన భార్య లింగమార్పిడి చేయించుకున్న హిజ్రా అని పరీక్షల్లో తేలడంతో షాక్ గురైన భర్త అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్య వైద్య నివేదికతో వధువు, ఆమె తల్లిదండ్రులు, వివాహ మధ్యవర్తి పై భర్త ఫిర్యాదు చేయడంతో వారిపై తాము ఐపీసీ సెక్షన్ 420 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అత్తమామలతో పాటు 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఇన్ స్పెక్టర్ చెప్పారు.
This post was last modified on June 23, 2021 3:28 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…