Trends

డేవిడ్ వార్న‌ర్ తెలుగు పోస్టు చూశారా?


ప్ర‌స్తుతం తెలుగు వారికి, ముఖ్యంగా హైద‌రాబాద్ వాసుల‌కు అత్యంత ఇష్ట‌మైన విదేశీ క్రికెట‌ర్ ఎవ‌రు అంటే మ‌రో మాట లేకుండా డేవిడ్ వార్న‌ర్ పేరు చెప్పేస్తారేమో. ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు ఆడుతూ అత‌ను అంత‌గా మ‌న జ‌నాల మ‌న‌సుల్లోకి చొచ్చుకుపోయాడు. త‌న ఆట‌తోనే కాక చ‌ర్య‌ల‌తోనూ వార్న‌ర్ మ‌న వాళ్లను క‌ట్టి ప‌డేశాడు. టిక్‌టాక్‌లో తెలుగు పాట‌లకు స్టెప్పులేస్తూ అత‌ను చేసే సంద‌డి అంతా ఇంతా కాదు.

ముఖ్యంగా గ‌త ఏడాది క‌రోనా వ‌ల్ల త‌లెత్తిన‌ లాక్ డౌన్‌లో అత‌ను తెలుగు బ్లాక్‌బ‌స్ట‌ర్ పాట‌ల‌తో సోష‌ల్ మీడియాను హోరెత్తించాడు. ఆ త‌ర్వాత ఐపీఎల్‌కు వ‌చ్చిన‌పుడు కూడా మ‌న వాళ్ల మీద అమిత‌మైన ప్రేమ చూపించాడు. మామూలు స‌మ‌యాల్లో కూడా వార్న‌ర్ ఇండియా అన్నా, హైద‌రాబాద్ అన్నా ప్ర‌త్యేక‌మైన అభిమానాన్ని చూపిస్తుంటాడు.

ఈ క్ర‌మంలోనే వార్న‌ర్ తాజాగా పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్టు మ‌న వాళ్లంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఇండియాలో ఐపీఎల్ ఆడుతున్న‌పుడు, బ‌య‌ట తిరుగుతున్న‌పుడు తీసిన కొన్ని ఫొటోలు షేర్ చేస్తూ naa rendo illu భార‌త‌దేశం inka lo naaku annitikanna nache pradesham హైద‌రాబాద్ అంటూ వ్యాఖ్య జోడించిన వార్న‌ర్.. #family #love #india #home #friends అనే హ్యాష్ ట్యాగ్‌ల‌ను కూడా జోడించాడు.

ఇలా తెలుగు ప‌దాల‌తో పోస్టు పెట్ట‌డానికి ఇక్క‌డి వాళ్లు ఎవ‌రో సాయం చేసి ఉండొచ్చు కానీ.. ఇలా మ‌న భాష‌లో పోస్టు పెట్టాల‌న్న వార్న‌ర్ ఆలోచ‌న‌కు మ‌న వాళ్లు ఫిదా అయిపోతున్నారు. మామూలుగానే వార్న‌ర్‌ను అమితంగా ఇష్ట‌ప‌డే హైద‌రాబాదీలు.. ఈ పోస్టుతో మ‌రింతగా అత‌డి అభిమానిస్తార‌న‌డంలో సందేహం లేదు. ఈ ఏడాది ఐపీఎల్లో స్థాయికి త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌నందుకు వార్న‌ర్‌ను తుది జ‌ట్టుకు దూరం పెడితే అభిమానులు తీవ్ర స్థాయిలో స్పందించ‌డం తెలిసిందే.

This post was last modified on June 16, 2021 10:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రశాంత్ వర్మ ప్లానింగ్ ఎలా ఉండబోతోంది

గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…

20 minutes ago

నిత్యమీనన్ ఆ బయోపిక్ ఎందుకు చేయలేదు?

దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…

45 minutes ago

గౌతమ్ మీనన్ షాకింగ్ కామెంట్స్

తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

2 hours ago

‘షా’ మాట‌లు హుష్‌.. బీజేపీ నేత‌లు మార‌రా?

కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నాయ‌కుడు అమిత్ షా నాలుగు రోజుల కింద‌ట ఏపీలో ప‌ర్య‌టించా రు. విజ‌యవాడ…

2 hours ago

వ‌ల‌సల‌పై ట్రంప్ నిర్ణ‌యం.. అమెరికాకు చేటేనా?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎలాంటి మాట‌లు చె ప్పినా.. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు…

3 hours ago

కొత్త తరం దర్శకులతో చిరంజీవి లైనప్

తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…

4 hours ago