Trends

జైపూర్ ఆటో డ్రైవర్..స్విస్ లో పాపులర్ యూట్యూబర్

మనిషి జీవితానికి మించిన కథేం ఉంటుంది. తాజా స్టోరీ చదవితే రీల్ స్టోరీకి ఏ మాత్రం తీసిపోనిదిగా ఉంటుంది. కలలా ఉంటే అతడి జీవితం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రవాస భారతీయులుగా తమదైన ముద్ర వేసిన వారికి సంబంధించిన వివరాల్ని అందించే ఒక వెబ్ సైట్ పుణ్యమా అని జైపూర్ కు చెందిన ఆటోడ్రైవర్ రంజిత్ సింగ్ (ఇప్పుడు స్విట్జర్లాండ్ లో ఉన్నాడనుకోండి) లైఫ్ స్టోరీ ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది. నిజానికి అతగాడి జీవితాన్ని స్పూర్తిగా తీసుకొని మాంచి బాలీవుడ్ మూవీకి ప్లాన్ చేయొచ్చు.

రాజస్థాన్లోని జైపూర్ కు చెందిన రంజిత్ సింగ్ పేదరికంతో పాటు పెద్దగా చదువుకోలేదు. పదో తరగతి ఫెయిల్ అయ్యాడు. పదహారేళ్ల వయసుకే ఆటో డ్రైవర్ గా మారాడు. అతడికి ఫారిన్ లాంగ్వేజ్ లు రాకపోవటంతో జైపూర్ లోని చాలామంది మాదిరి సంపాదించేవాడు కాదు. దీనికి తోడు చామన ఛాయతో ఉండటం.. ఆకర్షణీయంగా ఉండని అతన్ని కొందరు విదేశీయులు హేళన చేసేవారు. దీంతో.. తీవ్రమైన మనోవ్యధకు గురయ్యేవాడు.

చదువుకోకున్నా.. ఏదోలా తనదైన గుర్తింపు తెచ్చుకోవాలని తపన చెందేవాడు. ఆ పట్టుదలతో ఇంగ్లిష్.. ఫ్రెంచ్.. స్పానిష్ భాషలు నేర్చుకున్నాడు. ఆటో డ్రైవింగ్ తో పాటు సొంతంగా టూరిస్టు బిజినెస్ స్టార్ట్ చేశాడు. అతడి మర్యాద.. విదేశీ పర్యాటకుల విషయంలో అతడు అందించే సర్వీస్ తో అతడి బిజినెస్ పెరిగింది. ఇలాంటి సమయంలోనే సినిమాటిక్ పరిణామం చోటు చేసుకుంది. ప్రాన్స్ నుంచి వచ్చిన ఒక యువతి జైపూర్ కు వచ్చింది. రంజిత్ సేవల్ని అందుకుంది. ఈ క్రమంలో ఆమె రంజిత్ తో ప్రేమలో పడింది.

ఫ్రాన్స్ కు వెళ్లాక కూడా వారి ప్రేమ కొనసాగింది. వారి బంధాన్ని పెళ్లితో మరింత పటిష్టం చేసుకోవాలని నిర్ణయించారు. అయితే.. రంజిత్ కు ఫ్రాన్స్ కు వెళ్లటానికి వీసా అడ్డంకులు ఎదురయ్యాయి. అతడికి వీసా ఇవ్వటానికి ఎంబసీ ఒప్పుకోలేదు. దీంతో.. అతడి ప్రేయసే భారత్ కు వచ్చి వీసా సమస్యల్ని పరిష్కరించి తనతో తీసుకెళ్లింది. అనంతరం వీరి పెళ్లి 2014లో జరిగింది. ప్రస్తుతం వారికి ఇద్దరు పిల్లలు. ఇంతవరకు ఒక ఎత్తు. ఇప్పుడే మరో ఎత్తు. ప్రేయసితో ఫ్రాన్స్ కు వెళ్లి.. పెళ్లి చేసుకున్న రంజిత్ కు అక్కడి ఆహారం ఏ మాత్రం సూట్ అయ్యేది కాదు.

దీంతో.. సొంతంగా వండుకునేవాడు. ఈ క్రమంలో వంట చేస్తూ సరదాగా వాటిని యూట్యూబ్ లో పోస్టు చేశాడు. కొన్నేళ్లకు వారు స్విస్ కు మారారు. అక్కడ కూడా తన వంటల వీడియోల్ని పోస్టు చేయటం.. అవికాస్తా పాపులర్ కావటంతో ఇప్పుడతనికి కొత్త గుర్తింపు లభించింది. త్వరలోనే అక్కడో ఇండియన్ రెస్టారెంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాడు. అతను సక్సెస్ కావాలని కోరుకుందాం. రీల్ స్టోరీకి ఏమాత్రం తీసిపోని రీతిలో రంజిత్ రియల్ లైఫ్ ఉంది కదూ?

This post was last modified on June 15, 2021 10:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మారుతికి కొత్త‌ర‌కం టార్చ‌ర్

రాజాసాబ్ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతూ సినిమా మామూలుగా ఉండ‌ద‌ని చెబుతూ, ప్ర‌భాస్ అభిమానుల‌కు భ‌రోసానిస్తూ, తేడా…

1 hour ago

సంచలన బిల్లు: అసెంబ్లీకి రాకపోతే జీతం కట్

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. తాజాగా బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు బడ్జెట్…

1 hour ago

శంక‌ర్‌కు బ‌డా నిర్మాత కండిష‌న్‌

రాజ‌మౌళి కంటే ముందు సౌత్ ఇండియ‌న్ సినిమా స్థాయిని పెంచి.. అద్భుత‌మైన క‌థ‌లు, క‌ళ్లు చెదిరే విజువ‌ల్ ఎఫెక్ట్స్, సాంకేతిక…

2 hours ago

హిర‌ణ్య క‌శ్య‌ప‌ను వ‌ద‌ల‌ని గుణ‌శేఖర్

హిర‌ణ్య‌క‌శ్య‌ప‌.. టాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు చ‌ర్చ‌ల్లో ఉన్న చిత్రం. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్.. రుద్ర‌మ‌దేవి త‌ర్వాత తీయాల‌నుకున్న సినిమా…

3 hours ago

పిఠాపురం కోసం ఢిల్లీ వరకు.. కేంద్ర మంత్రులకు పవన్ విజ్ఞాపన

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర…

3 hours ago

వైసీపీ మాజీ ఎంపీ నుంచే వైసీపీ కార్యకర్తకు బెదిరింపులా?

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో…

6 hours ago