రోటీన్ కు భిన్నమైన లవ్ స్టోరీలు చాలానే చూసి ఉంటాం. విని ఉంటాం. కానీ.. ఈ రియల్ లవ్ స్టోరీ అందుకు భిన్నమైనది. తెలిసినంతనే జీర్ణించుకోవటానికి కాస్త టైం పడుతుంది. వీరిద్దరి ప్రేమాయణాన్ని నెటిజన్లు కూడా నో చెప్పేస్తున్నారు. వారిద్దరి కెమిస్ట్రీని తిట్టిపోస్తున్న వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. సాధారణంగా రోటీన్ కు భిన్నమైన అంశాల విషయంలో మిగిలిన వారికి భిన్నంగా వ్యవహరించే సోషల్ మీడియా.. ఈ జంట విషయంలో అందుకు భిన్నంగా వ్యవహరించటం గమనార్హం.
అమెరికాకు చెందిన 60 చెర్లీకి.. 23 ఏళ్ల క్యూరన్ కు మధ్య కెమిస్ట్రీ కుదిరింది. వారిద్దరి మధ్య లవ్ మొదలైంది. ఘాటైన ముద్దులు ఇస్తూ.. బిగి సడలని హగ్ లు ఇవ్వటమే కాదు.. ఏ మాత్రం అవకాశం లభించినా రొమాన్సు చేస్తున్నారు. అంతకు మించి ఇద్దరు కలిసి టిక్ టాక్ వీడియోలు చేస్తున్నారు. ఇంతకీ మీ ఇంట్లో చెప్పే ఇదంతా చేస్తున్నావా? నీ ప్రేమకు వాళ్లు ఓకే చెప్పారా? అని గట్టిగానే నిలదీస్తున్నారు సోషల్ మీడియాలో. అంతేకాదు.. అమ్మమ్మతో ప్రేమేంటిరా బాబు? అని క్లాస్ పీకుతున్నోళ్లు లేకపోలేదు.
తమ ఇద్దరు ఇళ్లల్లో తమ ప్రేమ గురించి తెలుసని.. వారు ఒప్పుకున్నట్లుగా ఈ జంట చెబుతోంది. తన కుర్ర లవ్వర్ కంటే పెద్ద వయసున్న తన పిల్లలు కూడా తాజా ప్రేమకథకు ఓకే చెప్పేసినట్లుగా చెర్లీ చెబుతోంది. అయితే.. వీరిద్దరి ప్రేమను నెటిజన్లు ఏకేయటమే కాదు ట్రోల్ చేస్తున్నారు. చెర్లీ సంపన్నురాలు కావటంతోనే క్యూరస్ అంతలా ప్రేమిస్తున్నాడని వ్యాఖ్యానిస్తున్నారు. మరి.. కాలం వారి ప్రేమకథలో మరెన్ని మలుపుల్ని తీసుకొస్తుందో చూడాలి.
This post was last modified on June 12, 2021 6:31 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…