మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్… ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను నిర్మూలించే వ్యాక్సిన్‌ను తయారుచేసేందుకు ఏడు ఫ్యాక్టరీలు పెట్టేందుకు సిద్ధమని ప్రకటించారు. గత నెలలో జరిగిన మైక్రోసాఫ్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్‌కు హాజరైన బిల్ గేట్స్… తన సంపాదనలో చాలా భాగం ధాతృత్వ పనుల కోసమే వినియోగించబోతున్నట్టు ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టడమే బిల్ గేట్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
దీని వ్యాక్సిన్ కోసం ఏడు కంపెనీలు పెడతామని… అందులో బెస్ట్ అనుకున్న రెండు వ్యాక్సిన్లను ఫైనల్ ట్రయల్స్ కోసం తీసుకుంటామని చెప్పారు. అంటే మిగిలిన ఐదు కంపెనీల మీద పెట్టిన పెట్టుబడి మొత్తం వేస్ట్ కాబోతుందన్నమాట. అయితే సమయాన్ని ఆదా చేసేందుకు ఏడు కంపెనీలను నిర్మించబోతున్నట్టు… తెలిపారు గేట్స్.
ధనం కంటే సమయం ముఖ్యమని… ఆలస్యం చేస్తే వేలమంది ప్రాణాలు కోల్పోవచ్చని ఆయన వివరించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాక్సిన్ తయారుచేసి, క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తి చేసుకోవడానికి ఎంత లేదన్నా 12 నుంచి 18 నెలల సమయం పడుతుందట.
వ్యాక్సిన్ తయారుచేసి ఈ ఏడు కంపెనీల మీద ఆయన కొన్ని వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. దీంతో యూఎస్ ప్రభుత్వం కంటే బిల్ గేట్స్ అంకితభావం అద్భుతమని సోషల్ మీడియాలో కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఆపదలో అక్కరకు రాని కాసుల కంటే తిరిగిరాని కాలానికి, ప్రాణానికి విలువ ఇవ్వాలనే బిల్ గేట్స్ ఆలోచనా విధానం గ్రేట్ కదా మరి!!
This post was last modified on April 9, 2020 6:49 pm
సినిమాలకు సంబంధించి క్రేజీ సీజన్లకు చాలా ముందుగానే బెర్తులు బుక్ చేసేస్తుంటారు. తెలుగులో ఏడాది ఆరంభంలో సంక్రాంతి సీజన్కు బాగా…
ఏపీలోని కూటమి ప్రభుత్వంలోనే కాదు.. పార్టీల్లోనూ ప్రక్షాళన జరగనుందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. పార్టీల పరంగా పైస్థాయిలో నాయకులు…
రాజకీయ రంగ ప్రవేశానికి ముందు విజయ్ చివరి సినిమాగా చెప్పుకున్న జన నాయకుడు జనవరి 9 విడుదల కానుంది. మలేసియాలో…
సోమవారం వచ్చేసింది. ఎంత పెద్ద సినిమా అయినా వీక్ డేస్ మొదలుకాగానే థియేటర్ ఆక్యుపెన్సీలో తగ్గుదల ఉంటుంది. కాకపోతే అది…
మన శంకరవరప్రసాద్ గారులో వెంకటేష్ క్యామియో గురించి ఎన్ని అంచనాలు ఉన్నాయో చెప్పనక్కర్లేదు. పేరుకి గెస్టు రోల్ అంటున్నా ఇరవై…
మూడున్నర గంటలకు పైగా నిడివి అంటే ప్రేక్షకులు భరించగలరా? రణ్వీర్ సింగ్ మీద ఒక సినిమా అనుభవమున్న దర్శకుడు స్వీయ…