కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే దేశంలో తగ్గుముఖం పడుతోంది. నాలుగు లక్షల కేసుల నుంచి లక్ష కేసులకు చేరుకున్నాం. అయితే.. కరోనాతోపాటు.. దేశ ప్రజలను బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. ఈ బ్లాక్ ఫంగస్ కేసులు సైతం వేలల్లో నమోదౌతూనే ఉన్నాయి.
అయితే.. ఈ బ్లాక్ ఫంగస్ ఎక్కువగా పురుషుల మీదే ప్రభావం చూపిస్తోందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. బ్లాక్ ఫంగస్ వచ్చిన వారిలో కరోనా బారిన పడి కోలుకున్న వారే అధికమని, అందులోనూ పురుషులే 80శాతం మంది ఉన్నారని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. కోవిడ్ సోకని వారిలోనూ 64శాతం బ్లాక్ ఫంగస్ కేసులు పురుషుల్లోనే ఉన్నాయి.
ఇక బ్లాక్ ఫంగస్ వచ్చిన వారిలో షుగర్ పేషెంట్లు ఎక్కువగా ఉన్నారన్నారు. అందులోనూ షుగర్ తో బాధపడుతున్న పురుషులే ఎక్కువని ఆ అధ్యయనం తేల్చింది. బ్లాక్ ఫంగస్ వచ్చిన వారు సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే 12వారాల్లో మరణించే అవకాశం ఉందని ఆ అధ్యయనం హెచ్చరించింది.
అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఆద్వర్యంలో దాదాపు 16 వైద్య సంస్థలు చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశంలో ఫస్ట్ వేవ్ ముగిసిన తర్వాత ఈ అధ్యయనం జరిగింది.
బ్లాక్ ఫంగస్ ముక్కు, కన్ను, ఊపిరితిత్తులు, ముత్రపిండాలు, చర్మంపై ప్రభావం ఎక్కువ ప్రభావం చూపిస్తోందట. దీనిని వెంటనే గుర్తించకుంటే.. 6 నుంచి 12 వారాల్లో మరణించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
This post was last modified on June 9, 2021 4:56 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…