సుశీల్ కుమార్.. దేశం గర్వించదగ్గ రెజ్లింగ్ క్రీడాకారుడు. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి ఆ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారుడిగా రికార్డులకెక్కాడు. 2008 ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో కాంస్యం సాధించిన అతను తర్వాతి ఒలింపిక్స్‌లో రజతం అందుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్షిప్ రెజ్లింగ్‌లో స్వర్ణం సాధించిన తొలి క్రీడాకారుడిగానూ అతను ఘనత వహించాడు. ఇంకా ఎన్నో గొప్ప విజయాలు, ఘనతలు అతడి ఖాతాలో ఉన్నాయి. ఇలాంటి దిగ్గజ క్రీడాకారుడు ఇప్పుడు ఓ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటుండటం.. పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతుండటం.. అతడి కోసం 50 మంది దాకా పోలీసులు ఎనిమిది బృందాలుగా విడిపోయి గాలిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
ఈ నెల 4న సాగర్ అనే రెజ్లర్ ఢిల్లీలోని ఛత్రశాల రెజ్లింగ్ స్టేడియం ప్రాంగణంలో హత్యకు గురయ్యాడు. అతడితో పాటు మరో ఇద్దరు స్నేహితులను ఓ గ్యాంగ్ హాకీ, బేస్ బాల్ బ్యాట్లతో చితకబాదింది. ఈ క్రమంలో సాగర్ తలకు బలమైన గాయం తగిలి అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో ప్రిన్స్ అనే ఒక రెజ్లర్‌ను అరెస్టు చేయగా.. అతడి దగ్గర లభించిన ఫోన్లో దాడి ఘటన మొత్తం రికార్డ్ చేసినట్లు తెలిసింది. ఆ వీడియోలో సుశీల్ సైతం బాధితులపై దాడికి పాల్పడుతున్న దృశ్యం ఉందట.
బాధితుల్లో ఒకరు సుశీలే తమ మీద దాడి చేసినట్లు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. సాగర్‌కు, సుశీల్‌కు పాత గొడవలు ఉన్నట్లు తెలిసింది. ఒకప్పుడు సాగర్.. సుశీల్ ఇంట్లోనే అద్దెకు ఉండేవాడు. కొన్ని నెలల పాటు అద్దె చెల్లించకపోవడంతో ఇల్లు ఖాళీ చేయాలని సుశీల్ ఆదేశించాడట. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ తలెత్తి.. అందరి ముందు సుశీల్‌ను బద్మాష్ అనే కాక మరికొన్ని బూతులు తిట్టాడట సాగర్. తర్వాత సుశీల్ ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయినప్పటికీ అందరి దగ్గర తన గురించి చెడుగా చెబుతుండటంతో సుశీల్ అతడిపై తన బృందంతో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఐతే ఈ దాడిలో సాగర్ ఏకంగా ప్రాణాలే కోల్పోయి మర్డర్ కేసు సుశీల్ మెడకు చుట్టుకుంది.
This post was last modified on May 9, 2021 9:22 am
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…