గత ఏడాది ఇండియాలో కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)కు ఎనలేని ప్రాధాన్యం పెరిగింది. అంతకుముందు ఈ పేరుతో ఓ సంస్థ ఉందని తెలియని వాళ్లు కూడా.. కరోనా ధాటికి ఆ సంస్థ ఇచ్చే మార్గదర్శకాలను పాటించడం మొదలుపెట్టారు. దేశంలో కొవిడ్‌పై పోరులో ఈ సంస్థ ఇచ్చే సూచనలు, మార్గదర్శకాలు ఎంతో కీలకంగా మారాయి.
వాట్సాప్ యూనివర్శిటీ మేధావుల పుణ్యమా అని కోవిడ్ వేళ ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న జనాలు.. కరోనాకు సంబంధించి ఏ విషయంలోనైనా ఐసీఎంఆర్ చెప్పినట్లు నడుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అదునుగా ఐసీఎంఆర్ లోగో వేసి ఫేక్ ప్రచారాలు చేసేవాళ్లూ లేకపోలేదు. తాజాగా ఐసీఎంఆర్ పేరిట ఒక నోట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
కొవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ జనాలను మరింత గందరగోళానికి, భయానికి గురి చేసేలా ఉంది ఆ నోట్. రెండేళ్ల పాటు ప్రయాణాలేవీ పెట్టుకోవద్దు. ఆరు నెలల పాటు థియేటర్లు, మాల్స్ వైపు చూడొద్దు. ఏడాది పాటు బయటి తిండి ముట్టుకోవద్దు. శాఖాహారం మాత్రమే తినండి. మాంసాహారం ముట్టుకోవద్దు. హ్యాండ్ కర్చీఫ్ వాడొద్దు… ఇలాంటి సూచనలున్నాయి ఐసీఎంఆర్ పేరిట హల్‌చల్ చేస్తున్న నోట్‌లో.
ఇందులో కొన్ని మరీ అతిగా అనిపిస్తుండటంతో జనాలు అయోమయానికి గురవుతున్నారు. జనాలను తప్పుదోవ పట్టించేలా ఉన్న ఈ నోట్ గురించి ఐసీఎంఆర్ దృష్టికి రావడంతో ట్విట్టర్లో ఆ సంస్థ స్పందించింది. సదరు నోట్‌ను తమ ట్విట్టర్ పేజీలో షేర్ చేస్తూ ఇది ఫేక్ అని, దీన్ని పట్టించుకోవద్దని స్పష్టం చేసింది. కానీ ఈ లోపే కొందరు ప్రముఖులు సైతం ఈ నోట్‌ను షేర్ చేసి సర్క్యులేట్ చేశారు. వాట్సాప్ గ్రూపుల్లోకి కూడా ఇది వెళ్లిపోయింది.
This post was last modified on May 7, 2021 9:05 am
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…
తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి…
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…