బాహుబలి, కెజిఎఫ్, పుష్ప తర్వాత ఒక సీక్వెల్ కోసం మూవీ లవర్స్ విపరీతంగా ఎదురు చూసిన సినిమా దురంధర్ ది రివెంజ్. మొదటి భాగం రిలీజైనప్పుడు ఎలాంటి అంచనాలు లేకుండా వందా రెండు వందలు కాదు ఏకంగా పదమూడు వందల కోట్లు కొల్లగొట్టిన ఆల్ టైం బ్లక్ బస్టర్ గా రణ్వీర్ సింగ్, ఆదిత్య ధార్ చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. అందుకే కొనసాగింపు మీద ఇంత ఆసక్తి నెలకొంది.
ఈసారి ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా తెలుగుతో సహా అయిదు ప్రధాన భాషల్లో పార్ట్ 2 రానుంది. ముందు రోజు మార్చి 18 సాయంత్రం నుంచే పెయిడ్ ప్రీమియర్లతో దురంధర్ రివెంజ్ మొదలవుతుంది. ఇవాళ ట్రైలర్ విడుదల చేశారు. రెహమాన్ డకాయిట్ (అక్షయ్ ఖన్నా) చనిపోయాక ఆ సామ్రాజ్యాన్ని పాలించే అవకాశం హంజా (రణ్వీర్ సింగ్)కు దక్కుతుంది. లియరీ డాన్ ప్రాణాలు కోల్పోయాక ఆ ప్రాంతంలో ఏర్పడిన ఊచకోత, రక్తపాతాన్ని హంజా తన చేతుల్లోకి తీసుకుంటాడు.
అయితే ఇండియాలో జస్కిరాత్ సింగ్ రంగి పేరుతో హంజాకో దారుణమైన హింసాత్మకమైన గతం ఉంటుంది. మనుషులను నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోసిన చరిత్ర నుంచి పాకిస్థాన్ లో జెండా ఎగరేసే స్థాయిలో ఎలా వచ్చాడనేది దురంధర్ రివెంజ్ లో చూపించబోతున్నారు. హంజా అక్కడి నేర సామ్రాజ్యాన్ని, రాజకీయాన్ని ఎలా భూస్థాపితం చేశాడో తెలియాలంటే ఇంకో పదకొండు రోజులు ఆగాలి.
అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మొత్తం యాక్షన్ విజువల్స్ తో నింపేశారు. మూడు నిమిషాల వీడియోలో చాలా ఫాస్ట్ కట్స్ ఉన్నాయి. కొన్ని అర్థం చేసుకోవాలంటే స్లో మోషన్ పెట్టుకుంటే తప్ప క్యాచ్ చేయలేం. అక్షయ్ ఖన్నా మినహాయించి మిగిలిన పాత్రలన్నీ ఇందులో కంటిన్యూ కాబోతున్నాయి.
శాశ్వత్ సచ్ దేవ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఊహించినట్టే ఇంటెన్స్ తో కొనసాగింది. మొత్తానికి రికార్డులు బద్దలయ్యే హామీ దురంధర్ ది రివెంజ్ ట్రైలర్ లో కనిపించింది. ఇప్పుడునా హైప్ ని అందుకుంటే మాత్రం ఈసారి రెండు వేల కోట్లు వసూలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. నాలుగు గంటల ప్యూర్ యాక్షన్ డ్రామాతో ఆదిత్య ధార్ కనువిందు చేయబోతున్నారు.
This post was last modified on March 7, 2026 1:06 pm
స్థానిక సంస్థల ఎన్నికల విషయంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తరచుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ఎన్నికల నిర్వహణ…
స్పీకర్ ను అవమానించిన వాళ్లకు ముంబైలో దాడులకు పాల్పడిన కసబ్ కు పెద్దగా తేడా ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్…
వైసీపీ ఖాళీ అవుతుంది.. ఈ మాటలు తరచుగా వినిపిస్తున్నాయి. అయితే.. పోయే వారిని పోనీ.. అన్నట్టుగానే పార్టీ అధినేత జగన్…
అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ సంపాదించుకున్న యూత్ ఫాలోయింగ్ కి అదనంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని జోడించిన బ్లాక్ బస్టర్…
"హలో... ఐ యామ్ చిట్టి. స్పీడ్ వన్ టెరా హెర్ట్జ్, మెమరీ వన్ జెట్టా బైట్!" రజనీకాంత్ రోబో సినిమాలో…
మొన్నటిదాకా వరస డిజాస్టర్లతో మార్కెట్ రిస్క్ లో పడేసుకున్న సూర్య మాములు కంబ్యాక్ ఇవ్వలేదు. అసలు పెద్దగా అంచనాలు లేకుండా…