భయంతో ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటాం. సమస్య ఏమంటే.. భయం కూడా ఒక అలవాటుగా మారితే.. అప్రమత్తత అంతకంతకూ తగ్గుతుంది. ఇదే సైకాలజీ కరోనా 2.0 కొత్త సమస్యల్ని తీసుకురావటమే కాదు.. రోజు గడిచేసరికి లక్షలాది మందిని కరోనా బారిన పడేలా చేస్తోంది. ఇలాంటివేళ.. కొన్ని నిబంధనల్ని మార్చుకోవాల్సిన పరిస్థితి. మొదటి వేవ్ లో.. ముఖానికి మాస్కు పెట్టుకోవటం అలవాటైన సంగతి తెలిసిందే.
మరి.. రెండో వేవ్ లో ముఖానికి ఒక మాస్కు కాదు.. రెండు మాస్కులు వాడక తప్పని పరిస్థితి. ఈ విషయంపై నిపుణులు చెబుతున్నా.. ఆ తీరును ఫాలో అయ్యే ప్రముఖుల్ని చూసింది లేదు. అందుకు భిన్నంగా అమెరికా అంటువ్యాధుల నిఫుణుడు.. ఆ దేశాన్ని కరోనా బారి నుంచి బయట పడేసేందుకు శ్రమించి.. సక్సెస్ అయిన ఆంటోనీ ఫౌచీకి సంబంధించిన తాజా ఫోటో ఒకటి ప్రపంచానికి మార్గదర్శకంగా మారింది. ఎందుకంటే.. ఆయన తన ముఖానికి ఒకటి కాదు.. రెండు మాస్కులు పెట్టుకోవటం ఆసక్తికరంగానే కాదు.. హాట్ టాపిక్ గా మారింది.
కరోనా 2.0 వేళ.. ముఖానికి ఒక మాస్కు కాదు.. రెండు మాస్కులు అవసరమన్న విషయాన్ని ఆయన ప్రత్యేకంగా చెబుతున్నారు. మొదటి మాస్కు సర్జికల్ మాస్కు.. దాని పైన వస్త్రంతో చేసిన మాస్కుసరిపోతుందని చెబుతున్నారు. రెండు మాస్కులతో ముఖాన్ని కవర్ చేయటం ద్వారా.. కరోనా బారిన పడకపోవటానికి ఎక్కువ అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కొత్త రకాలు వెలుగు చూస్తున్న వేళ.. మరింత రక్షణ కోసం డబుల్ మాస్కును ధరించటం తప్పనిసరి అని చెబుతున్నారు.
మొదటి మాస్కుతో ఎవైనా ఖాళీలు మిగిలిపోతే.. వైరస్ సోకే వీలుంది. అందుకు భిన్నంగా రెండు మాస్కులు పెట్టుకోవటం ద్వారా.. ముఖం మొత్తాన్ని కప్పేసే వీలుందని చెబుతున్నారు. ఫౌచీ లాంటి నిపుణుడే.. తన ముఖానికి డబుల్ మాస్కు పెట్టుకొని ఫోటో దిగటమే కాదు.. దాన్నే ఫాలో అవుతున్న వేళ..మాస్కు రూల్ ను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పక తప్పదు.
This post was last modified on April 26, 2021 8:22 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…