గత ఏడాది కరోనా దెబ్బకు తీవ్ర ఒత్తిడిలో ఉన్న భారతీయులకు గొప్ప ఉపశమాన్నిచ్చిన టోర్నీ ఇండియన్ ప్రిమియర్ లీగ్. కొన్ని నెలల పాటు బయటకు అడుగు పెట్టే అవకాశం లేక బయట అన్ని రకాల వినోదాలు దూరమైన సమయంలో యూఏఈలో జరిగిన ఐపీఎల్ 13వ సీజన్ ఎన్నడూ లేనంత ఉత్కంఠభరితంగా, ఆసక్తికరంగా సాగి అభిమానులను మురిపించింది. గాయపడ్డ భారతీయుల హృదయాలకు ఆ టోర్నీ మందేసిందనడంలో సందేహం లేదు.
ఈసారి యధావిధిగా వేసవిలోనే.. అది కూడా స్వదేశంలోనే లీగ్‌ను నిర్వహించడానికి బీసీసీఐ రంగం సిద్ధం చేసింది. మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఎందుకైనా మంచిదని ఖాళీ స్టేడియాల్లో టోర్నీ నిర్వహించడానికి బీసీసీఐ నిర్ణయించింది. కానీ టోర్నీ దగ్గర పడుతుండగా ఆందోళనకర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లీగ్‌ను కరోనా వెంటాడుతోంది. ఇప్పటిదాకా ఐపీఎల్‌తో ముడిపడ్డ వాళ్లలో 40 మందికి పైగా కరోనా బారిన పడటం గమనార్హం.
ముంబయిలో ఎప్పుడూ కూడా కరోనా తగ్గుముఖం పట్టింది లేదు. అయినా సరే.. అక్కడ ఐపీఎల్ నిర్వహించాలని పట్టుబట్టి కూర్చున్నందుకు బీసీసీఐ ఇప్పుడు తల పట్టుకుంటోంది. వాంఖడె మైదాన సిబ్బందిలోనే పది మందికి పైగా కరోనా బారిన పడ్డారు. అక్కడే స్టార్ స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ సిబ్బంది 15 మంది దాకా పాజిటివ్‌గా తేలారు.
ఇదంతా ఒకెత్తయితే ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందిలో కూడా కరోనా కేసులు బయటపడుతుండటం ఆందోళనను పెంచుతోంది. ముందు అక్షర్ పటేల్.. ఆ తర్వాత దేవ్‌దత్ పడిక్కల్ కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. వీరిలో పడిక్కల్ కోలుకున్నాడు. అక్షర్ ఐసొలోషన్లో ఉన్నాడు. తాజాగా బెంగళూరు ఆటగాడు డేనియల్ సామ్స్ కరోనా పాజిటివ్‌గా తేలాడు. అతడి కంటే ముందు ముంబయి ఇండియన్స్ కోచ్‌ల్లో ఒకడైన కిరణ్ మోరె వైరస్ బారిన పడ్డారు. సామ్స్, కిరణ్ బయో బబుల్ లోపల ఉన్నా కూడా కరోనా బారిన పడటాన్ని బట్టి.. బబుల్ ఎంత పక్కాగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బబుల్ లోపలి వాళ్లు కరోనా బారిన పడ్డారంటే.. వైరస్ వ్యాప్తి ఇంతటితో ఆగుతుందని చెప్పలేం.
ఇలా కేసులు పెరుగుతూ పోబట్టే గత నెలలో పాకిస్థాన్ సూపర్ లీగ్‌ను అర్ధంతరంగా ఆపేయాల్సి వచ్చింది. ప్రస్తుతానికి శుక్రవారం ఐపీఎల్ మొదలుపెట్టడానికి సర్వం సిద్ధమైంది కానీ.. మున్ముందు కేసులు మరిన్ని బయటపడితే మాత్రం టోర్నీ ముందుకు సాగడం కష్టమే.
This post was last modified on April 8, 2021 2:36 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…