ప్రపంచాన్ని కరోనా వైరస్ ఇప్పట్లో వదిలేట్లు కనబడటం లేదు. ఒకరూపం కాకపోతే మరోరూపంలో విజృభిస్తునే ఉంది. తాజాగా 8 దేశాల్లో మళ్ళీ లాక్ డౌన్ విధించారంటేనే పరిస్ధితి ఎంత భయంకరంగా ఉందో అర్ధమైపోతోంది. సౌదీ అరేబియా, టాంజానియా, బ్రెజిల్, యూకే, ఫ్రాన్స్ , ఇటలీ, స్పెయిన్ దేశాలు సంపూర్ణ లాక్ డౌన్ విధించాయి. బయట ప్రపంచంతో పై దేశాలు అన్నీ రకాల రాకపోకలను నిషేధించాయి.
పై దేశాల్లో అంతర్గత పరిస్ధితులను బట్టి కొన్ని దేశాలు రెండు వారాలు లాక్ డౌన్ అంటే మరికొన్ని దేశాలు నెల రోజుల వరకు లాక్ డౌన్ అన్నాయి. పైన చెప్పిన కొన్ని దేశాల్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్, మరికొన్ని దేశాల్లో థర్డ్ వేవ్ కూడా మొదలైనట్లు ప్రభుత్వాలు ఆందోళన పడుతున్నాయి. కొన్ని దేశాల్లో కరోనా వైరస్ తీవ్రత తగ్గినట్లే తగ్గి మళ్ళీ ఒక్కసారిగా పెరిగిపోతోంది.
యావత్ ప్రపంచం సుమారు 8 నెలల పాటు వైరస్ దెబ్బకు తల్లక్రిందులైనపోయిన విషయం అందరికీ తెలిసిందే. కొన్ని లక్షల మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఆర్ధిక వ్యవస్ధలు కుప్పకూలిపోయాయి. ఇటలీ, న్యూజిల్యాండ్, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో అయితే ఏకంగా ప్రభుత్వాలే తల్లకిందులైపోయాయి. ప్రపంచం మొత్తం మీద సుమారు 15 కోట్లమంది ఉద్యోగ, ఉపాధిని కోల్పోయారు.
ఒకవైపు కరోనా వైరస్ కు విరుగుడుగా యాంటీ వ్యాక్సిన్ తయారైనా వైరస్ బాధితులు మాత్రం అంతకంతకు పెరిగిపోతున్నారు. కరోనా కూడా ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుని విజృంభిస్తోంది. కరోనా టీకాలు వేసుకున్న వారిలో కూడా మళ్ళీ వైరస్ సోకుతోంది. అలాగే టీకాలు వేసుకున్న వాళ్ళు కూడా చనిపోతున్నారు. టీకాలు వేసుకున్న వారికి కరోనా వైరస్ సోకటానికి, చనిపోవటంపై వైద్య నిపుణులు పరిశోధనలు చేస్తున్నారు. మొత్తం మీద మళ్ళీ లాక్ డౌన్ పెరిగిపోతుండటం ఆందోళనకరమనే చెప్పాలి.
This post was last modified on March 19, 2021 10:18 am
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…