హైదరాబాద్ లో మరో దారుణం వెలుగు చూసింది. ఇంట్లో పని కోసం తీసుకొచ్చిన పని మనిషిపై.. సదరు యజమాని ఫ్లాట్ లో బంధించి రెండు వారాలుగా లైంగిక దాడికి పాల్పడుతున్న వైనం తాజాగా బయటకు వచ్చింది. నిందితుడి నుంచి తప్పించుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు రెండు వారాలకు కానీ ఫలించలేదు. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిలింనగర్ లో ఒక అపార్ట్ మెంట్ లో ఉదయ భాను అనే యాభైరెండేళ్ల వ్యాపారి ఉంటున్నాడు. సినీ పరిశ్రమలో పని చేస్తున్న ఇతడు..గత నెల 17న రాజమండ్రి నుంచి ఒక పని మనిషిని రప్పించుకున్నాడు. అపార్ట్ మెంట్ లోనే ఒక గదిని కేటాయించి ఆమె ఉండేందుకు చోటు కల్పించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఊరు నుంచి వచ్చిన పక్క రోజున ఆమె పని చేస్తుంటే.. బలవంతంగా తన రూమ్ లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడడ్డాడు.
ఈ విషయం బయటకు వస్తే.. నిన్ను.. నీ కుమార్తెను చంపేస్తానని బెదిరించాడు. అదే సమయంలో ఆమె దగ్గర సెల్ ఫోన్ ను లాక్కొని తన వద్దే పెట్టుకున్నాడు. అది మొదలు.. ఆమెను బెదిరిస్తూ.. లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా.. గది బయట తాళం వేసి వెళ్లిపోతున్నాడు. తనపై జరుగుతున్న దాడి గురించి కుమార్తెకు చెప్పుకునే వీలు లేకపోయింది. ఈ నెల 5న సదరు నిందితుడు బయటకు వెళుతున్న సమయంలో ఆమె తన సెల్ ఫోన్ ను తీసుకొని.. జరిగిన విషయాన్ని కుమార్తెకు చెప్పింది.
వెంటనే స్పందించిన కుమార్తె.. డయల్ 100కు ఫోన్ చేసి తన తల్లికి ఎదురైన ఇబ్బందికర పరిస్థితి గురించి చెప్పింది. దీంతో.. స్పందించిన పోలీసులు వెంటనే సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా.. ఆమెను బంధించిన లొకేషన్ ను గుర్తించారు. సిబ్బందితో కలిసిన బంజారాహిల్స్ పోలీసుల టీం అపార్ట్ మెంట్ లోకి ప్రవేశించి.. బాధితురాలికి విముక్తి కల్పించారు. అనంతరం ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.
This post was last modified on March 7, 2021 2:53 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…