ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. నిర్లక్ష్యం.. అమితమైన వేగం.. వీటికి తోడు మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం. పెద్ద ఎత్తున ప్రాణాలు తీస్తున్నప్పటికి మద్యం తాగి వాహనాన్ని నడపకూడదన్న బుద్ధి మాత్రం రావట్లేదు. తాజాగా అనంతపురంలోని కియా కార్ల ఫ్యాక్టరీ ప్రధాన గేటు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కారు ముందు భాగం మొత్తం నుజ్జు నుజ్జుకావటమే కాదు.. ఒక టైరుపూర్తిగా బయటకు వచ్చేసి.. ప్రమాదానికి దూరంగా పడి ఉండటం చూస్తే.. ప్రమాద తీవ్రత ఎంతన్నది అర్థమవుతుంది.
అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచి సమీపంలోని కియా కార్ల పరిశ్రమ ప్రధాన గేటు వద్ద జరిగిన ఈ దుర్ఘటన లో నలుగురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రమాదానికి గురైన కారు బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఢిల్లీకి చెందిన ఒక యువతి.. బెంగళూరుకు చెందిన ముగ్గురు యువకులు ఉన్నట్లుగా తేలింది. ప్రమాదస్థలిలో లభించిన ఆధార్ కార్డులతో ఈ సమాచారం బయటకు వచ్చింది.
డ్రైవింగ్ చేసిన వ్యక్తి చేతిలో బీరు బాటిల్ ఉండటాన్ని పోలీసులు గుర్తించినట్లు చెబుతున్నారు. దీంతో.. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవ్ చేస్తున్న యువకుడు ఒకచేత్తో బీర్ బాటిల్.. మరో చేత్తో స్టీరింగ్ పట్టుకొని ఉన్నట్లు అర్థమవుతుంది. అసలీ ప్రమాదం మొత్తం కారునడిపిన యువకుడి నిర్లక్ష్యమేనని చెప్పాలి. ఎందుకంటే.. ముందు ఉన్న గుర్తు తెలియని వాహనం వేగం తగ్గటం.. వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీ కొనటంతోఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు ఘటనాస్థలంలోనే మరణించారు. మృతదేహాల్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. ఒకరి నిర్లక్ష్యం.. ఎన్ని కుటుంబాల్లో విషాదాన్ని నింపుతుందో ఈ ప్రమాదాన్ని చూస్తే అర్థం కాక మానదు.
This post was last modified on March 2, 2021 12:00 pm
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…