మిస్ ఇండియా పోటీలకు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. మనదేంలోని పలువురు మాజీ మిస్ ఇండియాలు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్లు, సెలబ్రిటీలు ఒక వెలుగు వెలిగారు. అందుకే, మోడలింగ్ లోకి అడుగుపెట్టిన యువతులంతా మిస్ ఇండియా కావాలని కలలు కంటుంటారు. అయితే, ఆ కల సాకారం చేసుకోవాలంటే అందంతోపాటు కాసింత అదృష్టం కూడా ఉండాలి.
అ అందం…అదృష్టం రెండూ మెండుగా ఉన్న మన తెలంగాణ అమ్మాయి మానస వారణాసి మిస్ ఇండియా కలను సాకారం చేసుకుంది. వీఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీల్లో మానస విజేతగా నిలిచి అరుదైన ఘనత సాధించింది. బుధవారం రాత్రి ముంబైలో జరిగిన పోటీల్లో మానస వారణాసి విజేతగా నిలిచింది.
ఈ పోటీల్లో హరియాణా అమ్మాయి మానిక శికంద్ ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా 2020గా నిలిచింది. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన మాన్యసింగ్ ఫెమినా మిస్ ఇండియా 2020 రన్నరప్‌గా నిలిచారు. జ్యూరీ సభ్యులుగా బాలీవుడ్ నటులు నేహా ధుపీయా, చిత్రాంగద సింగ్, పులకిత్ సమ్రాట్, ప్రముఖ డిజైనర్ ఫల్గుణి వ్యవహరించిన ఈ పోటీల మొదటి రౌండ్‌కు మిస్ వరల్డ్ ఆసియా 2019 సుమన్ రావు నాయకత్వం వహించారు.
వీఎల్సీసీ ఫెమీనా మిస్ ఇండియా 2020 పోటీలకు సెఫోరా, రోపోసా యాప్స్ స్పాన్సర్ చేశాయి. ఈ పోటీల గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఫిబ్రవరి 28న ప్రముఖ హిందీ ఛానల్ కలర్స్ టీవీలో ప్రసారం కానుంది. మన తెలుగమ్మాయి మానస ఇదే ఊపును కొనసాగిస్తూ మిస్ వరల్డ్ పోటీల్లోనూ విజేతగా నిలవాలని ఆల్ ది బెస్ట్ చెబుదాం.
This post was last modified on February 11, 2021 12:23 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…