మైనర్ తో నడిపిన ప్రేమ, చేసుకున్న పెళ్ళి వికటించటంతో చివరకు ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వివరాలు ఏమిటంటే చిత్తూరు జిల్లాకు చెందిన బాలాజీ అనే యువకుడు హోటల్ మేనేజ్మెంట్ చేశాడు. చెన్నైలోని కొంతకాలం ఉద్యోగం చేసిన తర్వాత తన మకాంను విశాఖపట్నంకు మార్చాడు. వైజాగ్ లోని ఓ హోటల్లో పనిచేస్తుండగానే తాడిచెట్లపాలెంకు చెందిన ఓ మైనర్ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు.
కొంతకాలం వాళ్ళ ప్రేమాయణం బాగానే నడిచిన తర్వాత ఇద్దరు వివాహం చేసుకున్నారు. కూతురు వివాహం విషయం తెలియటంతో ఆ అమ్మాయి తల్లి, దండ్రులు వాళ్ళిద్దరినీ విడదీశారు. ఇందులో భాగంగానే కూతురును విజయవాడలోని ఓ హాస్టల్లో చదువునిమ్మతం చేర్పించారు. విషయం తెలుసుకున్న బాలాజీ కూడా వైజాగ్ ఉద్యోగం వదులుకుని తాను కూడా విజయవాడ చేరుకున్నాడు.
విజయవాడలో ఇద్దరు తరచు కలుసుకునే వారు. అయితే కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఎప్పుడైతే గొడవలు మొదలయ్యాయో అప్పటి నుండి ఆ అమ్మాయి బాలీజీని దూరం పెట్టేసింది. ఈ నేపధ్యంలోనే ఆ అమ్మాయికి మరో యువకుడితో పరిచయం ఏర్పడటం అదికాస్త చివరకు ప్రేమగా మారి చివరకు పెళ్ళి చేసుకున్నారు.
మొదటి తనను వివాహం చేసుకుని మళ్ళీ ఇంకో యువకుడిని పెళ్ళి చేసుకున్నదని తెలుసుకున్న బాలాజీ అమ్మాయిని వేధించటం మొదలుపెట్టాడు. చివరకు వేధింపులు ఎక్కువైపోవటంతో వ్యవహారం పోలీసుస్టేషన్ దాకా వెళ్ళింది. పోలీసులు అందరినీ పిలిపించి బాలాజీకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారు. అయితే దీన్ని అవమానంగా భావించిన బాలాజీ చివరకు ఆత్మహత్యకు చేసుకున్నాడు. మొత్తానికి మైనర్ యువతితో నెరిపిన ప్రేమ, పెళ్ళి చివరకు యువకుడినే బలితీసుకుంది.
This post was last modified on February 8, 2021 11:11 am
తెలంగాణ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. దీనికి ముందు జరిగిన ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు పంచిన నగదు.. వంటివి కీలక…
``ఫలానా వ్యక్తితో కలిసి పనిచేయండి.. ఫలానా పార్టీతో చేతులు కలపండి!`` అని ప్రధాని నరేంద్ర మోడీ తన రాజకీయ జీవితంలో…
కొందరు హీరోయిన్లు అసలేం మాట్లాడుతున్నారో ఆలోచించకుండా ఏదో ఒకటి అనేస్తారు. ఇప్పుడు రాధికా ఆప్టే అదే కోవలోకి వస్తోంది. బాలకృష్ణతో…
ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న భారత మహిళా అంధుల క్రికెట్ జట్టును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు…
తెలుగులో చాలా వేగంగా అగ్ర కథానాయికగా ఎదిగి.. కొన్నేళ్ల పాటు ఒక వెలుగు వెలిగింది రకుల్ ప్రీత్. కానీ వరుస…
ఎంత బ్లాక్ బస్టర్ అయినా ఒక్కోసారి రీ రిలీజులకు సరైన స్పందన రాదు. కొన్ని మాత్రం ఏకంగా రికార్డులు సాధించే…