మామూలుగా పోలీసులంటే జనాలందరికీ ఓ నెగిటివ్ అభిప్రాయముంది. దానికి కారణాలు బోలెడుంటాయి. అయితే అక్కడక్కడ పోలీసుల్లోనే తాము భిన్నమని కొందరు నిరూపించుకుంటుంటారు. అలాంటి ఘటనే తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని అడవి కొత్తూరు ప్రాంతంలో జరిగింది. ఇంతకీ విషయం ఏమిటంటే జిల్లాలోని కాశీబుగ్గ మున్సిపాలిటి ప్రాంతంలోని అడవికొత్తూరు గ్రామం ఉంది.
ఈ గ్రామపరిధిలోని పంట పొలాల్లో గుర్తతెలీని మృతదేహాన్ని స్ధానికులు గుర్తించారు. ఇదే విషయాన్ని స్ధానికులు పోలీసులకు తెలియజేశారు. దాంతో వెంటనే పోలీసు ఎస్సై శిరీష తన సిబ్బందితో వచ్చారు. విచారణ చేసిన తర్వాత మృతుడు అనాదగా తేల్చారు. దాంతో చేయాల్సిన పనిపై అందరితోను చర్చించారు. అయితే ఏమి చేయాలనే విషయమై స్ధానికుల్లో పెద్దగా సానుకూలత కనబడలేదు.
దాంతో చివరకు ఎస్సై శిరీషే పూనుకున్నారు. ఒకరిని తోడు తీసుకుని అనాద శవాన్ని మోయటానికి స్ట్రెచర్ లాంటిదాన్ని ఏర్పాటు చేశారు. పొలం నుండి మృతదేహాన్ని స్ట్రెచర్ పై ఎస్సై స్వయంగా 2 కిలోమీటర్ల మోసుకుంటూ వచ్చారు. 2 కిలోమీటర్లు అనాద శవాన్ని మోసుకురావటమే కాకుండా అంత్యక్రియలు కూడా దగ్గరుండి ఆమే జరిపించారు. ఈ ఘటనను కొందరు మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టారు.
ఎప్పుడైతే ఘటన మొత్తం సోషల్ మీడియాలో కనబడిందో వెంటనే అది వైరల్ గా మారింది. చివరకు అది పోలీసు ఉన్నతాధికారుల దగ్గరకు చేరింది. ఘటన మొత్తాన్ని చూసిన డీజీపీ గౌతమ్ సవాంగ్ ఎస్సైని అభినందిస్తు ట్వీట్ చేశారు.
This post was last modified on February 1, 2021 4:45 pm
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…