Trends

90 నిమిషాల వీడియోలకు ఇన్‌స్టాగ్రామ్ రెడీ!

సోషల్ మీడియా ప్రపంచంలో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. యూజర్లను తమ ప్లాట్‌ఫామ్‌పైనే ఎక్కువ సమయం గడిపేలా చేసేందుకు సంస్థలు కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాయి. ఈ పోటీలో ఇన్‌స్టాగ్రామ్ మరో అడుగు ముందుకేసి ఏకంగా 90 నిమిషాల నిడివి ఉన్న లాంగ్ వీడియోలకు అవకాశం కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు రీల్స్, షార్ట్ వీడియోలతో ఆకట్టుకున్న ఈ ప్లాట్‌ఫామ్ తాజా నిర్ణయంతో నేరుగా యూట్యూబ్‌కు పోటీ ఇవ్వబోతుందనే చర్చ మొదలైంది.

ఇన్‌స్టాగ్రామ్ అంటే ఇప్పటివరకు చిన్న వీడియోలు, ట్రెండింగ్ పాటలు, ఫ్యాషన్, వంటల వంటివే గుర్తొస్తాయి. అయితే కొన్ని విషయాలను వివరంగా చెప్పడానికి ఈ చిన్న వీడియోలు సరిపోకపోవడంతో, క్రియేటర్ల సౌలభ్యం కోసం పూర్తిస్థాయి సుదీర్ఘ వీడియోలపై ఇన్‌స్టాగ్రామ్ దృష్టి పెట్టింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా క్రియేటర్లు 90 నిమిషాల వరకు వీడియోలను అప్‌లోడ్ చేసుకోవచ్చు. సాధారణ రీల్స్‌లా కాకుండా ల్యాండ్‌స్కేప్ ఫార్మాట్‌లోనూ వీడియోలను చూసే అవకాశం ఉంటుంది. దీంతో ఇంటర్వ్యూలు, పాడ్‌కాస్ట్‌లు, ట్రావెల్ వ్లాగ్స్, విద్యా సంబంధిత కంటెంట్‌ను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లోనే అందించవచ్చు. ఇప్పటివరకు ఇలాంటి కంటెంట్ కోసం యూట్యూబ్‌ను ఆశ్రయించే వారికి ఇదొక ప్రత్యామ్నాయంగా మారనుంది.

ఈ ఫీచర్‌లో క్రియేటర్లకు ఉపయోగపడే మరో ముఖ్యమైన సదుపాయం కూడా ఉంది. సుదీర్ఘ వీడియోలోని ఆసక్తికరమైన సన్నివేశాలను చిన్న క్లిప్‌లుగా మార్చి రీల్స్ రూపంలో పోస్ట్ చేయవచ్చు. ఆ రీల్ చూసిన ప్రేక్షకులు పూర్తి వీడియోను కూడా వీక్షించేలా లింక్ చేసుకోవచ్చు. దీనివల్ల చిన్న వీడియోతో ప్రేక్షకులను ఆకర్షించి, పూర్తి కంటెంట్ వైపు తీసుకెళ్లడం సులువవుతుంది. అయితే ఈ ఫీచర్ ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం ఎంపిక చేసిన కొంతమంది క్రియేటర్లతో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు సమాచారం.

సుదీర్ఘ వీడియోల విషయంలో యూట్యూబ్‌కు ఇప్పటికే బలమైన స్థానం ఉంది. క్రియేటర్లకు ఆదాయం పొందే అవకాశాలు, ప్రత్యేక ప్రేక్షకుల వర్గం ఆ ప్లాట్‌ఫామ్‌కు ప్రధాన బలం. గతంలో ఐజీటీవీ పేరుతో లాంగ్ వీడియోలపై ప్రయోగం చేసిన ఇన్‌స్టాగ్రామ్‌కు ఆశించిన విజయం దక్కలేదు. అయినప్పటికీ ఇప్పుడు కొత్త వ్యూహంతో వస్తున్న ఈ ఫీచర్ క్రియేటర్లకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, యూట్యూబ్ ఆధిపత్వానికి ఇది నిజంగానే సవాల్ విసురుతుందా అనేది సాధారణ యూజర్లకు ఇది పూర్తిగా అందుబాటులోకి వస్తేనే స్పష్టమవుతుంది.

This post was last modified on November 4, 2026 11:41 am

Share

Recent Posts

దర్శకుడి వల్లే ఓమ్ లెక్క తప్పింది

అమరన్ వచ్చినప్పుడు దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామీ పేరు మారుమ్రోగింది. ఒక వీర సైనికుడి బయోపిక్ ని ఎమోషనల్ గా…

3 hours ago

ఫుట్‌పాత్ మాదే.. బైకులు ఆపండి!

ట్రాఫిక్‌లో చిక్కుకుంటే చాలు.. కొందరు వాహనదారులు ఎలాగైనా ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో రోడ్లపై ఖాళీ లేకపోతే ఫుట్‌పాత్‌లను…

3 hours ago

ఈ సారి వైఎస్‌ను వ‌ద‌ల్లేదు… రేవంత్ ప్లానేంటి?

స‌హ‌జంగా ఒక పార్టీకి చెందిన నాయ‌కులు ప్ర‌భుత్వంలో ఉంటే.. అదేపార్టీకి చెందిన గ‌త నాయ‌కుల‌ను విమ‌ర్శించ‌డం ఎక్క‌డా క‌నిపించ‌దు. గ‌తంలో…

4 hours ago

చిన్ననాటి జ్ఞాపకాలు మళ్లీ రిపీట్.. గోల్డ్ స్పాట్ గుర్తుందా?

ఒకప్పుడు భారతీయ శీతల పానీయాల మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గోల్డ్ స్పాట్ మరోసారి వార్తల్లో నిలిచింది. దాదాపు 26…

5 hours ago

శ్రీమతి మీద రీమేక్ ఒత్తిడి ఉంటుందేమో

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని పెద్దలు అంటారు. అదే విధంగా ఏ టైంలో జరగాల్సిన రీమేక్…

5 hours ago

అనిరుధ్ అందుకే స్పెషల్ అనిపిస్తాడు

ఓమ్ విడుదలయ్యాక సంగీత దర్శకుడు సాయి అభ్యంక్కర్ పనితనం గురించి మ్యూజిక్ లవర్స్ లో ఎడతెగని చర్చ జరుగుతోంది. ఈ…

5 hours ago