వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తన కుమార్తె డాక్టర్ బొత్స అనూషను తన రాజకీయ వారసురాలిగా అధికారికంగా రంగంలోకి దించారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా చక్రం తిప్పిన బొత్స కుటుంబం, ఇప్పుడు అనూష ద్వారా తమ తదుపరి తరం రాజకీయ భవిష్యత్తుకు గట్టి పునాది వేస్తోంది.
భీమిలి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త (ఇన్‌ఛార్జ్)గా బాధ్యతలు అప్పగించారు. ఇటీవల బొత్స సత్యనారాయణ స్వయంగా ఆమెను భీమిలి స్థానిక నాయకులకు, కార్యకర్తలకు పరిచయం చేసి, నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. అదేసమయంలో అనూష స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ రేసులో నిలబడనున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా సీనియర్ల వారసులకు స్థానిక ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించడంతో ఆమెకు ఈ అవకాశం దక్కింది.
ఇదేసమయంలో చీపురుపల్లిలోనూ యాక్టివ్ కావాలని అనూష ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తన తండ్రి సొంత నియోజకవర్గమైన చీపురుపల్లిలోనూ అనూష గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు. బొత్స కుటుంబానికి నమ్మకస్తుడిగా ఉండి ఇటీవల టీడీపీలోకి వెళ్లిన మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఉదంతం తర్వాత, పార్టీ క్యాడర్‌కు ధైర్యం చెప్పేందుకు బొత్స తన కుమార్తెను మరింత వేగంగా ప్రజల్లోకి తీసుకువచ్చారు.
ప్రజల్లో పాజిటివ్ రెస్పాన్స్ కోసం అనూష ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన అనూష, తన స్పష్టమైన ప్రసంగాలు, ప్రజా సంబంధాలతో తొలి అడుగుల్లోనే వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఆకట్టుకుంటున్నా రు. భీమిలి, విజయనగరం ప్రాంతాల్లో ఆమె చురుగ్గా పర్యటిస్తూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
బిగ్ సస్పెన్స్ ఇదే!
అయితే.. విజయనగరం జిల్లా పరిషత్ అభ్యర్థిగా అనూషను పార్టీ ఇంకా ఖరారు చేయలేదు. మరోవైపు నామినేషన్ల గడువు కూడా ముగుస్తున్న దరిమిలా.. ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. ఇది సహజంగానే పార్టీలో చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ తీసుకునే నిర్ణయంపైనే అనూష ఫ్యూచర్ ఆధారపడి ఉంటుందని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates