వెంకటేష్‌కు దూరమయ్యింది విజయ్‌కు వరమయ్యింది

దసరా సెలవులు ముగింపుకి వస్తున్న తరుణంలో ఒక విషయం బాగా అర్థమయ్యింది. సంక్రాంతి లాగా మరో కీలకమైన సీజన్ గా విజయదశమి అవతరించిందనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఆదర్శ కుటుంబం ఏకె 47 కనక ఒకవేళ ఈ పండక్కు వచ్చి టాక్ యావరేజ్ గా తెచ్చుకున్నా సరే కుటుంబ ప్రేక్షకులు నెత్తిన బెట్టుకునే వారు. కానీ బంగారం లాంటి ఈ అవకాశాన్ని విజయ్ దేవరకొండ రణబాలి ఫుల్లుగా వాడుకున్నాడు. టాక్ తో సంబంధం లేకుండా వీకెండ్ తో పాటు సోమ మంగళవారాలను క్యాష్ చేసుకున్నాడు.

రజనీకాంత్ జైలర్ 2 టాక్, కలెక్షన్లు దీనికన్నా మెరుగ్గా ఉన్నప్పటికీ, ఫ్యామిలీ ఆడియన్స్ మొదట ప్రాధాన్యం ఇచ్చే టాలీవుడ్ సినిమాల వరకు ఒకే ఆప్షన్ గా రణబాలి నిలవడంతో వసూళ్లు స్టడీగా వచ్చాయి. గరివిడి లక్ష్మికి మంచి రెస్పాన్స్ ఉన్నప్పటికీ స్టార్ క్యాస్టింగ్ లేకపోవడం మైనస్ అయ్యింది. ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో బాగా పెర్ఫార్మ్ చేస్తున్నా మిగిలిన చోట్ల నెమ్మదిగా ఉంది. ఆక్యుపెన్సీలు జస్ట్ ఓకే అనిపిస్తున్నాయి తప్పించి రజని, విజయ్ కు పోటీ ఇచ్చే స్థాయిలో కాదు.

వెంకటేష్ దూరం చేసుకున్నది కమర్షియల్ గా మంచి స్థాయి వచ్చే హిట్టు కాగా, విజయ్ కు వరమయ్యింది మార్కెట్ లో తనకు బలమైన కాంపిటీషన్ లేకపోవడం. ఒకరకంగా మైత్రి మేకర్స్ తీసుకున్న నిర్ణయం మొదట్లో రిస్క్ అనిపించినా ఇప్పుడదే సేఫ్ గేమ్ అయ్యింది. ఇప్పుడు ఆదర్శ కుటుంబం రిస్క్ లో పడింది. అక్టోబర్ 30 తర్వాత వారం తిరక్కుండానే రామాయణ పార్ట్ 1 వస్తోంది. ముందు రోజే ప్రీమియర్లు వేయబోతున్నారు. పాజిటివ్ టాక్ వస్తే దీన్ని ఆపడం కష్టమే.

అంతే కాదు సూర్య సీన్ కూడా రెడీ అయ్యింది. హ్యాట్రిక్ కోసం పరుగులు పెడుతున్న సూర్యకి మళ్ళీ టాక్ బాగుంటే మటుకు తెలుగు రాష్ట్రాల్లోనూ కాసులు లాగేస్తాడు. ఇదంతా ఊహించే దగ్గుబాటి అభిమానులు నిరాశకు గురవుతూ వచ్చారు. బజ్ విషయంలో ఇప్పటికీ వెనుకబడి ఉన్న ఆదర్శ కుటుంబం పాటల పరంగా తెచ్చుకున్న రెస్పాన్స్ అంతంత మాత్రంగా ఉండటం అందరి కళ్ళు ట్రైలర్ మీద ఉన్నాయి. అది కనక క్లిక్ అయితే మంచి ఓపెనింగ్స్ ని లాంగ్ రన్ వసూళ్లుగా మార్చుకోవచ్చు.