జైలర్ 2 లో హృతిక్ రోషన్ క్యామియో ఉందనేది ఎప్పుడో కన్ఫర్మ్ అయిన పాత న్యూస్. ఎంత నిడివి ఉంటుందనే దాని గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. నిజానికి ఈ పాత్ర బాలకృష్ణతో చేయించాలని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ చాలా ట్రై చేసినట్టు గతంలో వార్తలొచ్చాయి. షారుఖ్ ఖాన్ ని కూడా అడిగారట కానీ కింగ్ షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల డేట్స్ ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. దీంతో ఫైనల్ గా బంతి హృతిక్ రోషన్ దగ్గరకు వెళ్తే ఆయన ఓకే చెప్పేశాడు.
జనం ఊహించినట్టే రజని సమస్యలో ఇరుక్కున్నప్పుడు వచ్చే క్యామియోనే హృతిక్ ఇందులో చేశాడు. మొదటి భాగంలో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ ఈ డ్యూటీ చేయగా ఈసారి సిక్స్ ప్యాక్ వీరుడు తోడయ్యాడు. అయితే నిడివి మాత్రం మరీ ఎక్కువ లేకపోవడం కాదు కేవలం కొన్ని నిమిషాలకు మాత్రమే పరిమితం కావడం ఫ్యాన్స్ ని కొంత నిరుత్సాహానికి గురి చేసింది. పోలీస్ స్టేషన్ సీన్, మిథున్ ఇంటి మీద ఎటాక్ లాంటివి బాగా వచ్చాయంటే దానికి హృతిక్ స్క్రీన్ ప్రెజెన్స్ కారణమని చెప్పొచ్చు.
దశాబ్దాల క్రితం హృతిక్ రోషన్ చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన భగవాన్ దాదాలో రజనీకాంత్ హీరో. ఇప్పుడా రుణాన్ని తీర్చుకునే ఛాన్స్ వచ్చిందని హృతిక్ ఫీలై ఉంటాడు. తన కోసమే సినిమాకు వెళ్లే ఆడియన్స్ మటుకు ప్రీ క్లైమాక్స్ దాకా ఎదురు చూడాల్సిందే. నెల్సన్ ఈసారి క్యామియోలను సరిగా వాడుకోలేదనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. శివన్న, మోహన్ లాల్ ని చాలా పరిమితంగా చూపించడం ఈసారి వాళ్ళ అభిమానులకు అంతగా నచ్చినట్టు లేదు.
ఇదంతా ఎలా ఉన్నా హృతిక్ రోషన్ కల ఒకటి తీరిపోయింది. రజనితో కలిసి స్క్రీన్ పంచుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాడు. ఇది ఎంత పెద్ద సక్సెస్ అవుతుందనేది వీకెండ్ అయ్యాక వచ్చే కలెక్షన్లను బట్టి క్లారిటీ వస్తుంది. పూర్తి బ్యాడ్ టాక్ రాలేదు కాబట్టి సాలిడ్ థియేటర్ రన్ దక్కేలా ఉంది. ఈసారి క్యాస్టింగ్ కూడా బాగా కుదిరింది. సూరజ్, ఎస్జె సూర్య, విద్య బాలన్, మిథున్ చక్రవర్తి పండించిన విలన్ ఎపిసోడ్స్ మాస్ కి రీచ్ అవుతున్నాయి. హృతిక్ ఫ్యాక్టర్ హిందీ వెర్షన్ బిజినెస్ కు ఉపయోగపడింది.
This post was last modified on October 15, 2026 3:58 pm
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో అనుపమ పరమేశ్వరన్ కు క్రేజ్ ఉండేది. శతమానం భవతి, అఆ, ప్రేమమ్ లాంటి హిట్లు…
పెద్ది కష్టానికి తగ్గ ఫలితం రాలేదని రామ్ చరణ్ అభిమానులు ఫీలవ్వడం అబద్దం కాదు. తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు వచ్చినా…
దసరా సెలవులు బాక్సాఫీస్ కు మంచి రెవిన్యూ తెచ్చే సీజన్. సరిగ్గా వాడుకుంటే పది రోజుల పాటు థియేటర్లకు కలెక్షన్లు…
కన్నడ అమ్మాయి కృతి శెట్టికి కెరీర్ ఆరంభంలో దక్కిన విజయాలు చూసి.. తోటి హీరోయిన్లు అసూయ చెంది ఉంటారు. కేవలం…
రేపు ఉదయం ఏడు గంటలు మొదలుకుని రణబాలి షోలు ఏపీ తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభం కాబోతున్నాయి. ముందు రోజు ప్రీమియర్లు…
భారీ అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా.. జైలర్-2. అంచనాలకు…