Trends

చీరలోనే 47 ఏళ్ల తల్లి పరుగు.. ఇద్దరు కుమార్తెల భవిష్యత్తు కోసం..

కాళ్లకు స్పోర్ట్స్‌ షూస్‌ లేవు.. ఒంటిపై ఖరీదైన క్రీడా దుస్తులు లేవు.. సాధారణ చీర, చెప్పులతోనే బరిలోకి దిగారు. పరుగులో చెప్పులు పదేపదే జారిపోవడంతో వాటిని చేతిలో పట్టుకుని.. రాళ్లు తేలిన రహదారిపై పరుగెత్తారు. చివరకు ట్రాక్‌సూట్లు, స్పోర్ట్స్‌ షూస్‌తో వచ్చిన యువతులను వెనక్కినెట్టి మారథాన్‌లో తొలి స్థానంలో నిలిచారు 47 ఏళ్ల రమాబాయి రణ్‌వీర్‌. ఇద్దరు కుమార్తెల భవిష్యత్తు కోసం ఆమె సాగించిన ఈ పరుగు ఇప్పుడు స్ఫూర్తిగా నిలుస్తోంది.

బీడ్‌ జిల్లా అంబాజోగైలోని ఇండియన్‌ ఎడ్యుకేషన్‌ ప్రొపగేటర్‌ సంస్థకు చెందిన ఖోలేశ్వర్‌ ఎడ్యుకేషనల్‌ కాంప్లెక్స్‌ అమృత్‌ మహోత్సవం సందర్భంగా ‘అమృత్‌ రన్‌’ నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ చౌక్‌ నుంచి భాగ్యనగర్‌ చౌక్‌ వరకు జరిగిన ఈ పోటీలో రమాబాయి పాల్గొన్నారు.

పరుగు ప్రారంభమైన కొద్దిసేపటికే రమాబాయి ధరించిన సాధారణ చెప్పులు జారిపడటం మొదలయ్యాయి. దీంతో వాటిని చేతిలో పట్టుకుని చెప్పులు లేకుండానే పరుగును కొనసాగించారు. ఇటీవల కురిసిన వర్షాలతో చల్లగా మారిన, రాళ్లు తేలిన రహదారిపై కాళ్లకు నొప్పి వస్తున్నా వెనక్కి తగ్గలేదు. చీరను సర్దుకుంటూనే వేగంగా పరుగెత్తారు. ఒక్కొక్కరిని అధిగమిస్తూ చివరకు మొదటగా గమ్యస్థానానికి చేరుకున్నారు.

రమాబాయి విజయం చూసిన ప్రేక్షకులు చప్పట్లతో అభినందించారు. పోటీలో తొలి స్థానానికి లభించే రూ.3 వేల నగదు బహుమతి కోసం ఆమె పాల్గొన్నా.. దాని వెనుక ఉన్న అసలు లక్ష్యం మాత్రం తన ఇద్దరు కుమార్తెల భవిష్యత్తు.

కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయిన రమాబాయి.. హింగోలి నుంచి అంబాజోగైకి వచ్చి వంటమనిషిగా పనిచేస్తున్నారు. కుటుంబాన్ని పోషించుకుంటూనే కుమార్తెల భవిష్యత్తు కోసం శ్రమిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, సౌకర్యాల కొరత ఆమెను ఆపలేకపోయాయి. 

This post was last modified on August 31, 2026 3:44 pm

Share

Recent Posts

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

6 hours ago

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

7 hours ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

8 hours ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

8 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

11 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

12 hours ago