తెలుగు సినీ పరిశ్రమలో బోలెడన్ని సినీ జంటలున్నాయి. ఆ జాబితాలోకి ఎప్పటికప్పుడు కొత్త జంటలు చేరుతూనే ఉంటాయి. ఒక యువ సంగీత దర్శకుడు, ఒక యంగ్ హీరోయిన్ కలిసి జీవితాన్ని పంచుకోబోతున్నారంటూ ఇన్‌డైరెక్ట్‌గా వార్తలు రాసిన మీడియా, సోషల్ మీడియా జనాలు.. ఇక ఆ ఇబ్బంది లేకుండా ఓపెన్‌గా ఆ ఇద్దరి పేర్లు రాసేసే సమయం వచ్చింది.
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి పెద్ద కొడుకు కాలభైరవ.. ఒకప్పుడు బాలనటిగా అలరించి, కథానాయికగా మసూద, బలగం లాంటి చిత్రాలతో మెప్పించిన కావ్య కళ్యాణ్ రామ్ ప్రేమలో ఉన్న విషయం ఇప్పుడు అధికారికం అయిపోయింది. కాలభైరవ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక పోస్టుతో వీరి బంధం గురించి క్లారిటీ వచ్చేసింది.
కావ్యతో సన్నిహితంగా ఉన్న కొన్ని అందమైన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన కాలభైరవ.. ‘‘కావ్య బాబు.. నీతో సమయం గడుపుతున్నపుడు కొండల మీద కూర్చుని సెలయేరును చూస్తున్నట్లు ఉంటుంది. నీతో ఏం చేసినా అది విహారంలాగే ఉంటుంది. దాన్ని ఎప్పటికీ ముగించాలని అనుకోవట్లేదు నీతో మాట్లాడుతుంటే.. చలికాలంలో పొద్దు పొద్దునే నచ్చిన కాఫీ తాగుతున్నట్లుంటుంది.
ఇన్ని రోజులు ఈ బంధానికి ఏం పేరు పెట్టాలో అర్థం కాలేదు. చివరికి ఇప్పుడు నేను ఆ ఫీలింగ్‌కు ‘ఇల్లు’ అని పేరు పెట్టాలని గ్రహించా. నేను నిన్ను తొలిసారి కలిసినపుడు ఒక కొత్త వ్యక్తిని కలిసినట్లు అనిపించలేదు. ఒకసారి ఇంట్లో అడగుపెట్టాక తిరిగి వెనక్కి వెళ్లలేదు. ఇప్పుడు ఆ ఇంట్లో మనం జీవితాంతం కలిసి ఉండబోతున్న విషయాన్ని అందరికీ చెప్పడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నా’’ అని కాలభైరవ తన పోస్టులో పేర్కొన్నాడు. మరి ఈ ఇద్దరి పెళ్లి కబురు ఎప్పుడు చెబుతారో చూడాలి.
This post was last modified on August 31, 2026 3:53 pm
తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…
ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…
కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఒకవైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచన చేస్తామంటే కుదురుతుందా? అంటే కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ,…
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…