Trends

బాబోయ్.. డిటర్జెంట్‌ పొడితో 2.3 కోట్ల లీటర్ల పాలు తయారు?

 మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో పోలీసులు, ఆహార భద్రత-ఔషధ పరిపాలన (ఎఫ్‌డీఏ) సంయుక్తంగా నిర్వహించిన దర్యాప్తులో డిటర్జెంట్ పొడి, పామ్ ఆయిల్, నాసిరకం రసాయనాలతో సింథటిక్ పాలను తయారు చేసి మార్కెట్‌లో విక్రయించినట్లు గుర్తించారు. గత ఆరు నెలల్లో సుమారు 2.3 కోట్ల లీటర్ల కల్తీ పాలు వినియోగదారులకు చేరి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

దర్యాప్తులో నిందితుల విక్రయ రిజిస్టర్లను పరిశీలించగా, సుమారు 2,30,470 కిలోల నాసిరకం పాలపొడితో 23,04,070 లీటర్ల సింథటిక్ పాలు తయారు చేసినట్లు తేలింది. దీని విలువ సుమారు రూ.9.21 కోట్లుగా అంచనా వేశారు.

అధికారుల వివరాల ప్రకారం, ప్రతి 100 లీటర్ల స్వచ్ఛమైన పాలలో 10 లీటర్ల సింథటిక్ పాలు కలిపి విక్రయించినట్లు గుర్తించారు. ఈ లెక్కన భూమ్ ప్రాంతంలోని పాల సేకరణ కేంద్రాల నుంచి మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు 2.3 కోట్ల లీటర్లకు పైగా కల్తీ పాలు సరఫరా చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సింథటిక్ పాలు అసలైన పాలలా కనిపించేలా, కొవ్వు శాతం పెరిగినట్లు చూపించేందుకు డిటర్జెంట్ పొడి, పామ్ ఆయిల్, నాసిరకం రసాయన పొడులను ఉపయోగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ఈ వ్యవహారంలో ఏడుగురిపై పోలీసులు పలు కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేసు నమోదై ఎనిమిది రోజులు గడిచినా నిందితులు పరారీలో ఉండటంతో, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐటీ) ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

 రోజూ పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఎక్కువగా తీసుకునే పాలలోనే డిటర్జెంట్, రసాయనాలు కలపడం అత్యంత ప్రమాదకరం. వైద్యుల హెచ్చరికల ప్రకారం ఇలాంటి పాలను తరచూ తీసుకుంటే కాలేయం, మూత్రపిండాలు, జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. అంతేకాదు, ఈ తరహా కుంభకోణాలు ఒక్క రాష్ట్రానికే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

This post was last modified on July 14, 2026 11:39 pm

Share

Recent Posts

జిమ్ జిమ్ తార… కావాలనే వైరల్ చేసారా?

జిమ్ జిమ్ తార.. గత నాలుగైదు రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లో…

11 minutes ago

69 ల‌క్ష‌ల ఓట్లు హుష్‌..

తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన... స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌(సర్‌)లో 73 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఇది జరిగి…

43 minutes ago

ఇది కియారా అద్వానీకే సాధ్యం

ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ మంచి ఊపులో సాగుతుంటే వాళ్లు పెళ్లి జోలికి వెళ్లేవాళ్లు కాదు. అవకాశాలు తగ్గిపోయి, ఫేడవుడ్ అవుతున్న…

1 hour ago

మహా కథ మళ్ళీ కంచెర్లపాలెంకే

మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా రూపొందించిన ‘రావు బహదూర్’ సినిమా మీద టీం అంతా చాలా…

1 hour ago

నష్టాలు వచ్చాయని ఒప్పుకున్న నాని

తమ సినిమాలు థియేటర్లలో ఉండగా అందులో లోపాల గురించి.. దాని మీద వచ్చే విమర్శల గురించి, కలెక్షన్లు తక్కువ రావడం…

2 hours ago

చివరి మ్యాచ్‌లోనూ అదే మెస్సీ… వారసుడికే గోల్ ఇచ్చి వెళ్లాడు!

21 ఏళ్ల కెరీర్‌లో అర్జెంటీనా కోసం ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో మార్చిన లియోనెల్ మెస్సీ.. చివరి మ్యాచ్‌లోనూ తన మార్క్…

2 hours ago