అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపిస్తోంది. వరుసగా ప్రధానులు మారుతుండటంతో అక్కడి రాజకీయాల్లో అనిశ్చితి కొనసాగుతోంది.
తాజాగా ప్రధాని కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. రెండేళ్ల క్రితం భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన స్టార్మర్ ఇంత త్వరగా తప్పుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
స్టార్మర్ నిష్క్రమణతో గత పదేళ్లలో యూకేకు ఆరో ప్రధాని మారినట్టైంది. ఇప్పుడు ఏడో వ్యక్తి ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. తరచూ నాయకత్వ మార్పులు జరగడం అక్కడి రాజకీయ వ్యవస్థపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది.
అయితే యూకేలో చదువుతున్న భారతీయ విద్యార్థులు లేదా అక్కడికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న వారికి ప్రస్తుతం ఎలాంటి ఆందోళన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే జారీ చేసిన స్టూడెంట్ వీసాలు, పోస్ట్ స్టడీ వర్క్ అవకాశాలు, గ్రాడ్యుయేట్ రూట్ వంటి విధానాలు యథాతథంగా కొనసాగనున్నాయి. ప్రధాని మారిన వెంటనే ఇవి రద్దు కావడం లేదా నిలిచిపోవడం జరగదు.
కొత్త నాయకత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇమ్మిగ్రేషన్ విధానాలపై సమీక్ష జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా విదేశీ విద్యార్థుల సంఖ్య, వర్క్ పర్మిట్ నిబంధనలు, డిపెండెంట్ వీసాలకు సంబంధించిన అంశాలపై కొత్త నిర్ణయాలు రావొచ్చు. అందుకే యూకేకు వెళ్లాలని భావిస్తున్న విద్యార్థులు పరిస్థితులను గమనిస్తూ అధికారిక ప్రకటనలపై దృష్టి పెట్టడం మంచిది.
ప్రస్తుతం భారతీయ విద్యార్థుల చదువులు, వీసాలు, ఉద్యోగ అవకాశాలపై ఎలాంటి తక్షణ ప్రభావం లేదనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. అందువల్ల సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను నమ్మకుండా అధికారిక సమాచారాన్నే పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
This post was last modified on June 22, 2026 5:57 pm
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…
తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి…
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…