Movie News

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు చవి చూసిన ఈ మూవీకి చివరి నిమిషం వరకు షూటింగులు, రిపేర్లు జరుగుతూనే ఉన్నాయి. పబ్లిసిటీ విషయంలో అన్నపూర్ణ, సితార సంస్థలు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాయి. ఏపీ తెలంగాణ వ్యాప్తంగా చాలా థియేటర్లలో వీడియో సాంగ్ ని ప్లే చేయిస్తునే ఉన్నారు. ఏ సినిమాకు వెళ్లినా లెనిన్ ఒక రిమైండర్ లాగా ఉండాలనే ఆలోచనతో కొనసాగిస్తున్నారు.

ఒకరకంగా చెప్పాలంటే లెనిన్ కి గోల్డెన్ ఛాన్స్ దొరికింది. తెలుగు రాష్ట్రాల థియేటర్లు మంచి ఊపు మీద ఉన్నాయి. పెద్ది రెండు వారాలు నాన్ స్టాప్ గా జోష్ ఇచ్చింది. మూడో వారం వీకెండ్ లో మళ్ళీ కాస్త పికప్ చూపించి వసూళ్లు రాబట్టింది. బయట ఏమో కానీ తెలుగు రాష్ట్రాల వరకు సూపర్ హిట్ అనిపించుకుంది. సరే ఇదంటే ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి కమర్షియల్ లెక్కలు టఫ్ గా ఉంటాయి, కంక్లూజన్ కు రావడం కష్టం.

మా ఇంటి బంగారం చాలా రీజనబుల్ బిజినెస్ తో విడుదలై కేవలం రెండు రోజులకే బ్రేక్ ఈవెన్ దాటేయడం ట్రేడ్ కి మాములు కిక్ ఇవ్వడం లేదు. అసలు హీరోనే లేని ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీకి కుటుంబాలు ఇంత పెద్ద ఎత్తున తరలి రావడం గొప్ప విశేషం. కేవలం మూడు రోజులకే నలభై కోట్ల మార్కు దాటడం ఈ మధ్య కాలంలో ఏ మిడ్ రేంజ్ మూవీ వల్లా కాలేదు. సమంత, నందిని రెడ్డి, రాజ్ నిడిమోరు దాన్ని చేసి చూపించారు. విజయంతో పొంగిపోతున్నారు.

నెక్స్ట్ జూలై 10 లెనిన్ వంతు వస్తోంది. కంటెంట్ చాలా యునీక్ గా ఉంటుందని, ఊహించని ట్విస్టులు ఆశ్చర్యపరచడం ఖాయమని టీమ్ నమ్మకంగా చెబుతోంది. అఖిల్, భాగ్యశ్రీ బోర్సే ఫీల్డ్ లోకి దిగి ప్రమోషన్లు మొదలుపెట్టారు. పెద్ది, మా ఇంటి బంగారం తెచ్చిన ఊపు ఏదైతే ఉందో దాన్ని కొనసాగించాల్సిన బాధ్యత లెనిన్ మీద ఉంది. జస్ట్ బాగానే ఉందనే మాట తెచ్చుకున్నా చాలు మిగిలిన పని ప్రేక్షకులు చూసుకుంటారు. బ్లాక్ బస్టర్ కోసం అఖిల్ ఎదురుచూపులు దీంతో అయినా తీరతాయేమో చూడాలి.

This post was last modified on June 22, 2026 8:27 pm

Share

Recent Posts

జైలర్ 2 ఋజువు చేయాల్సినవి ఎన్నో

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి…

3 minutes ago

సెన్సార్ మీద ఎంత వ్యతిరేకత చూపించినా

టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…

3 hours ago

బీసీ రిజర్వేషన్లపై తేల్చేసిన సుప్రీం

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…

4 hours ago

తీరం చేరని ఏజెంట్ దర్శకుడి కలలు

ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…

4 hours ago

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

5 hours ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

5 hours ago