ఐపీఎల్‌లో సిక్సర్ల సునామీతో అందరినీ ఆశ్చర్యపరిచిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, ఇండియా A జట్టు తరఫున ఆడుతూ ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ స్థాయికి అలవాటు పడుతున్నాడు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా శ్రీలంక పిచ్‌లపై ఆడుతున్న ఈ కుర్రాడు తన మార్క్ హిట్టింగ్ చూపించలేక కాస్త ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది. లీగ్ లో టాప్ స్కోరర్‌గా, అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా వచ్చిన క్రేజ్ కు, ఇక్కడ ఇండియా A టీమ్‌లో అతను ఆడుతున్న తీరుకు చాలా తేడా కనిపిస్తోంది.
శ్రీలంకతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో వైభవ్ పూర్తిగా నిరాశపరిచాడు. కేవలం 14 పరుగులు మాత్రమే చేసి చాలా త్వరగా పెవిలియన్ చేరాడు. ఆ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు కొట్టి టచ్‌లోకి వచ్చినట్లు అనిపించినా, ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయాడు. ఐపీఎల్ లో బౌలర్లను వణికించిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, విదేశీ పిచ్‌లపై అంతర్జాతీయ స్థాయి బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో మొదటి మ్యాచ్‌లో కాస్త తడబడ్డాడు.
ఇక అఫ్గానిస్థాన్ A జట్టుతో జరిగిన రెండో మ్యాచ్‌లో వైభవ్ కాస్త మెరుగ్గా ఆడాడు. హాఫ్ సెంచరీకి కేవలం ఆరు పరుగుల దూరంలో.. అంటే 44 పరుగుల వద్ద కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కేవలం 22 బంతుల్లోనే 9 ఫోర్ల సాయంతో 44 రన్స్ చేసినా, అతని బ్యాట్ నుంచి ఒక్క సిక్స్ కూడా రాకపోవడం షాకింగ్. అతను చేసిన పరుగులలో 36 రన్స్ ఫోర్ల రూపంలోనే వచ్చాయి తప్ప, ఐపీఎల్ తరహాలో బంతులు స్టేడియం దాటలేదు.
ఐపీఎల్‌లో సిక్సర్ల రికార్డులు బద్దలు కొట్టిన ఒక పవర్‌ఫుల్ బ్యాటర్, ఇక్కడ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిని నెగెటివ్‌గా చూడాల్సిన అవసరం లేదు. కేవలం సిక్స్‌లపైనే ఆధారపడకుండా, విదేశీ కండిషన్స్‌కు తగ్గట్టుగా ఫోర్లతో కూడా స్కోరు బోర్డును ఎలా నడిపించవచ్చో వైభవ్ నిరూపించాడు. జాతీయ జట్టుకు ఆడే ముందు ఇలాంటి పిచ్‌లపై పరిణతితో ఆడటం అతనికి మంచి అనుభవంగా మారుతుంది.
ఐపీఎల్ లోని ఫ్లాట్ హైవే పిచ్‌లకు, శ్రీలంకలోని స్పిన్, పేస్‌కు అనుకూలించే విదేశీ పిచ్‌లకు చాలా తేడా ఉంటుంది. ఇప్పుడిప్పుడే ఈ తరహా వాతావరణానికి అలవాటు పడుతున్న వైభవ్, రాబోయే మ్యాచ్‌ల్లో తన లోపాలను సరిదిద్దుకుని మళ్లీ పాత ఫామ్‌ను అందుకుంటాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఏదేమైనా ఇండియా A జట్టులో దక్కిన ఈ అవకాశం వైభవ్ కెరీర్‌కు ఒక సాలిడ్ లెర్నింగ్ ప్రాసెస్ లాంటిది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
