Trends

అల్లాడిస్తున్న `బుండి బుగ్యో`… విమానాలు బంద్‌!

బుండి బుగ్యో-పేరు చిన్న‌దే అయినా.. ఏదో పెట్ నేమ్‌లా అనిపించినా.. ఇది పెద్ద ఎత్తున ప్ర‌పంచాన్ని కుదిపేస్తోంది. ప‌శ్చిమాఫ్రికా దేశాల్లో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి ఏర్ప‌డేలా కూడా చేసింది. ప్ర‌జ‌ల‌ను ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాకుండా ప్ర‌భుత్వాలు క‌ట్ట‌డి చేసే ప‌రిస్థితి కూడా వ‌చ్చింది. అదే.. ఎబోలా వైర‌స్ వేరియెంట్ రూప‌మైన బుండి బ్యుగో. ప్ర‌స్తుతం ప‌శ్చిమాఫ్రికా దేశాల్లో ఈ వైర‌స్ తీవ్రంగా వ్యాపిస్తోంది.

క‌రోనా టైపేనా?

అవును! బుండి బ్యుగో క‌రోనా వైరస్ టైపేన‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది. వ్యాప్తి, రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌గ్గుద‌ల వంటి విష‌యంలో క‌రోనాతో స‌మాన‌మేన‌ని స్ప‌ష్టం చేసింది. కొన్ని కొన్ని ప్రాంతాల్లో అత్యంత ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు కూడా తీసుకున్నారు. రోగుల‌ను గుర్తించేందుకు ప్ర‌పంచ స్థాయి వైద్యుల‌ను కూడా పంపించారు. ఈ వైర‌స్ సోకిన వారు.. 24 గంట‌ల్లోనే మృతి చెందుతుండ‌డం మ‌రో విషాదం.

భార‌త్‌లో..

ప‌శ్చిమాఫ్రికాలోని కాంగో, ఉగాండా దేశాల‌లో బుండి బుగ్యో వైర‌స్ వ్యాప్తి చెందిన నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం కూడా అలెర్ట్ అయింది. ఆయా దేశాల నుంచి వ‌చ్చే విమానాలలోని ప్ర‌యాణికుల‌ను నిశితంగా ప‌రిశీలించాల‌ని.. వారికి అవ‌స‌ర‌మైతే.. క్వారంటైన్ స‌దుపాయం క‌ల్పించాల‌ని కూడా సూచించింది. ద‌గ్గుతుమ్ము.. క‌ళ్లు ఎర్ర‌బార‌డం వంటి ల‌క్ష‌ణాలు ఉన్న ప్ర‌యాణికుల‌ను వేరు చేసి.. త‌గిన వైద్య సేవ‌లు అందించాల‌ని సూచించింది. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌.. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని విధించిన నేప‌థ్యంలో ప‌శ్చిమాఫ్రికా దేశాల‌కు.. విమానాల‌ను న‌డ‌ప‌డం ఆపేయాల‌ని నిర్ణ‌యించింది.

ఏంటి ల‌క్షణాలు…

గ‌త వారం వెలుగు చూసిన బుండి బుగ్యో వేరియంట్ కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు 88 మంది ప్ర‌జ‌లు మృతి చెందారు. వేలాది మంది చికిత్స పొందుతున్నారు. దీనికి ప్ర‌ధానంగా ద‌గ్గు, తుమ్ములు, క‌ళ్లు ఎర్ర‌బార‌డం.. జీర్ణ‌క్రియ‌లు మంద‌గించ‌డం.. జ్వ‌రం వంటివి వస్తాయి. ప్ర‌స్తుతం ఈ వైర‌స్ వేరియెంట్‌కు టీకాలు లేవ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది. అప్ర‌మత్తంగా ఉండాల‌ని సూచించింది. ఈ క్ర‌మంలోనే ప‌శ్చిమాఫ్రికా దేశాల‌కు అత్యవ‌స‌ర ప‌రిస్థితిని విధించింది.

This post was last modified on May 17, 2026 2:49 pm

Share

Recent Posts

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

2 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

2 hours ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

3 hours ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

5 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

7 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

8 hours ago