ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్‌లో ఎదురుదెబ్బ తగిలినా, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్‌లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఉత్కంఠభరిత పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై 65 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేయాల్సి రావడం, ఆపై పిచ్ ఛేజింగ్‌కు అనుకూలంగా ఉండటంతో మొదట్లో కొంత టెన్షన్ నెలకొంది. కానీ హైదరాబాద్ బ్యాటర్లు సమిష్టిగా రాణించి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు సాధించారు. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేకేఆర్ 16 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలింది.
హైదరాబాద్ బ్యాటింగ్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు అభిషేక్ శర్మ (48), ట్రావిస్ హెడ్ (46) మెరుపు వేగంతో ప్రారంభించారు. పవర్‌ప్లేలోనే 84 పరుగులు సాధించి ఈ సీజన్‌లోనే అత్యధిక స్కోరు నమోదు చేశారు. మధ్యలో వికెట్లు పడి నెమ్మదించినా, హెన్రిచ్ క్లాసెన్ (52) మెరుపు హాఫ్ సెంచరీ, నితీష్ కుమార్ రెడ్డి (39) మెరుపులు జట్టును ఒక ట్రాక్ కి చేర్చాయి. కేకేఆర్ బౌలర్లలో ముజారబానీ 4 వికెట్లతో రాణించినా, హైదరాబాద్ బ్యాటర్ల జోరును అడ్డుకోలేకపోయారు. ముఖ్యంగా చివరి ఓవర్లలో క్లాసెన్ బ్యాటింగ్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది.
లక్ష్య ఛేదనలో కేకేఆర్ ఓపెనర్ ఫిన్ అలెన్ (28) మొదటి ఓవర్లోనే 24 పరుగులు పిండుకుని భీకరంగా మొదలుపెట్టాడు. అయితే హర్ష్ దూబే తెలివిగా బౌలింగ్ చేసి అతన్ని అవుట్ చేయడంతో హైదరాబాద్ ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత జరిగిన రెండు రన్ అవుట్లు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాయి. కెమెరాన్ గ్రీన్, రఘువంశీ కీలక సమయంలో అవుట్ అవ్వడం కేకేఆర్ ఆశలపై నీళ్లు చల్లింది. ఒకానొక దశలో రింకూ సింగ్ (35) పోరాడినా, హైదరాబాద్ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసి వికెట్లు తీశారు. జయదేవ్ ఉనద్కత్ 3 వికెట్లతో కేకేఆర్ లోయర్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు.
అయితే ఫీల్డింగ్‌లో మాత్రం హైదరాబాద్ ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. చేతిలోకి వచ్చిన బాల్స్ లను బౌండరీ దగ్గర వదిలేయడం, మిస్ ఫీల్డింగ్ చేయడం వంటివి గెలిచే మ్యాచ్‌లను కూడా ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది. ఈ లోపాలను సరిదిద్దుకుంటే హైదరాబాద్‌కు తిరుగుండదు. మరోవైపు బౌలింగ్‌లో పస లేదన్న విమర్శలకు సన్‌రైజర్స్ బౌలర్లు తమ టాలెంట్ తో సమాధానం ఇచ్చారు. ఈడెన్ గార్డెన్స్ లాంటి బ్యాటింగ్ పిచ్‌పై కేకేఆర్ లాంటి పటిష్టమైన టీమ్‌ను 161 పరుగులకే కట్టడి చేయడం విశేషం. ఉనద్కత్‌తో పాటు నితీష్ రెడ్డి, మలింగ తలో రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు.
This post was last modified on April 3, 2026 9:34 am
విమానాలు భయపెడుతున్నాయి. గత వారం ఫ్లై దుబాయ్ విమానాన్ని కూల్చివేసేందుకు కో పైలట్ ప్రయత్నం చేయడం ప్రపంచ వ్యాప్తంగా వార్తయ్యింది.…
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…