Trends

తీరు మారని వైసీపీ… ‘అమరావతి’కి రాజ్యసభ ఓకే

ఏపీకి ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ పార్లమెంటు ఏకగ్రీవంగా అంగీకరించింది. ఈ మేరకు అమరావతి బిల్లుకు పార్లమెంటు దిగువ సభ లోక్ సభ బుధవారమే ఆమోదం తెలపగా… గురువారం పెద్దల సభ రాజ్యసభ కూడా ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. వెరసి అమరావతిని రాజధానిగా గుర్తించాలని ఏపీ అసెంబ్లీ పంపిన తీర్మానానికి పార్లమెంటు ఓకే చెప్పినట్టు అయ్యింది. ఈ బిల్లును లోక్ సభలో వ్యతిరేకించిన వైసీపీ… రాజ్యసభలోనూ అదే బాటలో సాగింది. అయినా అమరావతి బిల్లుకు ఎలాంటి ఆటంకం ఎదురు కాలేదు.

పార్లమెంటు ఆమోదం లభించిన అమరావతి బిల్లును కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి పంపనుంది. పార్లమెంటు ఆమోదించిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లాంచనప్రాయమేనని చెప్పాలి. రాష్ట్రపతి ఆమోదం లభించిన తర్వాత ఏపీకి ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ గెజిట్ తో ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి రికార్డుల్లోకి ఎక్కనుంది. ఆపై ఇక ఎవరొచ్చినా రాజధాని అమరావతిని మార్పు చేసే అవకాశం లేదని చెప్పాలి. 

అమరావతి బిల్లుపై తనదైన శైలి వైఖరిని ప్రదర్శించిన విపక్ష వైసీపీ… ఓ వైపు తాము అమరావతికి వ్యవతిరేకం కాదంటూనే… పార్లమెంటులోని రెండు సభల్లోనూ బిల్లును ఆ పార్టీ వ్యతిరేకించింది. లోక్ సభలో దీనిపై ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడగా… రాజ్యసభలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. మిథున్ రెడ్డి చెప్పిన మాటలనే చెప్పిన సుబ్బారెడ్డి అమరావతి బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించి సభ నుంచి వాకౌట్ చేశారు. వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలూ అమరావతి బిల్లుకు మద్దతు తెలపడం గమనార్హం.

This post was last modified on April 2, 2026 10:31 pm

Share

Recent Posts

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

2 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

4 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

5 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

5 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

13 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

15 hours ago