Trends

10 వేల కెపాసిటీ బ్యాటరీతో ఫోన్ వచ్చేసింది

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో రియల్‌మీ సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం భారత మార్కెట్లో పీ4 పవర్ 5G ఫోన్‌ను విడుదల చేసింది. ప్రపంచంలోనే మొదటిసారిగా ఒక మొబైల్‌లో ఏకంగా 10,001 mAh సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీని పరిచయం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ, ఈ ఫోన్ బరువు కేవలం 219 గ్రాములు మాత్రమే ఉండటం విశేషం.

ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఫోన్ 6.78 ఇంచుల 4D కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తోంది. 144Hz రిఫ్రెష్ రేట్, 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ దీని ప్రత్యేకత. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్‌తో పనిచేసే ఈ మొబైల్‌లో 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. ఇది లేటెస్ట్ రియల్‌మీ UI 7 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.

చార్జింగ్ పరంగా కూడా రియల్‌మీ తగ్గేదేలే అంటోంది. ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా, 27W రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది, అంటే మీ ఫోన్ ద్వారా ఇతర గ్యాడ్జెట్లను ఛార్జ్ చేసుకోవచ్చు. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం దీనికి IP69, IP68 రేటింగ్స్ ఇచ్చారు. స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ను వాడారు. 

ధరల వివరాల్లోకి వెళ్తే.. 

8GB/128GB వేరియంట్ రూ. 25,999

8GB/256GB వేరియంట్ రూ. 27,999

12GB/256GB వేరియంట్ రూ. 30,999

ట్రాన్స్‌ ఆరెంజ్, ట్రాన్స్‌ సిల్వర్, ట్రాన్స్‌ బ్లూ రంగుల్లో లభించే ఈ ఫోన్ అమ్మకాలు ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్‌తో పాటు రియల్‌మీ మరిన్ని గ్యాడ్జెట్లను కూడా లాంచ్ చేసింది. జెమిని పవర్డ్ వాయిస్ అసిస్టెంట్ ఉన్న బడ్స్ క్లిప్ ఇయర్‌బడ్స్‌ను రూ. 5,999 కి, అలాగే 20,000 mAh పవర్‌బ్యాంక్‌ను రూ. 2,799 కి ప్రవేశపెట్టింది. బ్యాటరీ బ్యాకప్ ముఖ్యం అనుకునే వారికి ఈ ఫోన్ ఒక అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు.

This post was last modified on January 29, 2026 7:04 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Realme p4

Recent Posts

వెండి కూడా బంగారానికి చేరువయ్యేలా..

​హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం…

3 hours ago

కూతురు కాదు కసాయి… షాకింగ్ ఘటన

అమ్మాయిది అగ్రకులం... అబ్బాయిది వెనుకుబడిన కులం...ఇద్దరూ ప్రేమించుకున్నారు...కానీ, ఈ కులాంతర వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు...ఆ తర్వాత ఆ ప్రేమ…

3 hours ago

జగన్ పాదయాత్రపై షర్మిల సంచలన వ్యాఖలు

ఈ మధ్యకాలంలో పొలిటికల్ సౌండ్ తగ్గించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్, వైఎస్ షర్మిల మళ్ళీ రంగంలోకి దిగారు. మహాత్మా గాంధీ…

6 hours ago

‘ఒరేయ్ తరుణ్ భాస్కర్… క్యారెక్టర్లో ఉండిపోకు’

దర్శకుడిగా తొలి చిత్రం ‘పెళ్ళిచూపులు’తో తరుణ్ భాస్కర్ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. రెండో సినిమా ‘ఈ నగరానికి…

6 hours ago

‘వారణాసి’లో పోస్టర్లు… జక్కన్న పనేనా..?

రాజమౌళి సినిమా అంటే ఒకప్పట్లా భారతీయ ప్రేక్షకులు మాత్రమే కాదు.. గ్లోబల్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. తన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…

7 hours ago

లడ్డూలో కల్తీ నెయ్యి నిజం అంటూ జగన్ పై ఫ్లెక్సీలు

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో వాడిన నెయ్యి కల్తీ అయిందని, నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని ఆరోపణలు…

8 hours ago