నిజంగా నిజం. నమ్మలేని వాస్తవం. ఒక షేరు విలువకు ఏకంగా 19480 శాతం మధ్యంతర డివిడెండ్ ను ప్రకటించిన ఒక టెక్నాలజీ కంపెనీ సంచలనంగా మారింది. ఎప్పుడైనా.. ఏ కంపెనీ అయినా ఇంత భారీగా డివిడెండ్ ప్రకటించిందా? అనిపించేలా ఉన్న ఈ షేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ కంపెనీ పేరేమిటి? అది అందించే సేవలు ఏమిటి? అన్న ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట వినిపిస్తోంది. స్టాక్ మార్కెట్ ను విస్మయానికి గురి చేసిన ఈ షేరు ఇప్పుడు పెను సంచలనం.
మెజెస్కో లిమిటెడ్. మొన్నటివరకు ఈ పేరు చాలామంది విని ఉండరు. కానీ.. ఆ కంపెనీ తీసుకున్న ఒక నిర్ణయం స్టాక్ మార్కెట్ పరిచయం ఉన్న ప్రతిఒక్కరు.. ఔరా అని అనుకునేలా చేసింది. దీనికి కారణం ఆ కంపెనీ తన షేరు విలువకు ఏకంగా 19480శాతం మధ్యంతర డివిడెండ్ ను ప్రకటించటమే. మరింత వివరంగా చెప్పాలంటే సదరు షేరు ముఖ విలువ కేవలం రూ.5 మాత్రమే. అయితే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను (2020-21) మధ్యంతర డివిడెండ్ పేరుతో రూ.974ను ప్రకటించింది. అంతేకాదు.. ఈ డివిడెండ్ చెల్లింపునకు డిసెంబరు 25ను రికార్డు డేట్ గా ఫిక్స్ చేసింది.
ఈ కంపెనీకి చెందిన 2.9 కోట్ల షేర్లు మార్కెట్లో ఉన్నాయి. తాజాగా ప్రకటించిన మధ్యంతర డివిడెండు కింద కంపెనీ రూ.2788.40 కోట్ల మొత్తాన్ని చెల్లించాల్సి రావొచ్చు. ఇదంతా జరిగినతర్వాత కూడా ఆ కంపెనీ చేతిలో ఇంకా రూ.100 కోట్ల విలువైన భూములు ఉండటం గమనార్హం. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ఈ కంపెనీ తన వ్యాపార కార్యకలాపాల్ని పూర్తిగా నిలిపివేసే ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.
అందుకే.. కంపెనీ ఖాతాలో ఉన్న సొమ్మును వాటాదార్లకు డివిడెండ్ రూపంలో పంచి పెడుతున్నట్లుగా తెలస్తోంది. డివిడెండ్ ప్రకటనతో మంగళవారం మెజెస్కో షేరు మార్కెట్ లో దూసుకెళ్లింది. ఒక దశలో 5శాతం పెరిగి రూ.1019 వద్దగరిష్ఠ మొత్తానికి ట్రేడ్ అయ్యింది. చివరకు రూ.982.20 వద్ద క్లోజ్ అయ్యింది. ఈ రోజు ఈ షేరు మరింతగా దూసుకెళుతుందన్న అభిప్రాయాన్ని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంచనా ఏ మేరకు నిజమవుతుందో చూడాలి.
This post was last modified on December 16, 2020 10:44 am
కొందరు దర్శకులు టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…