వివాహేతర సంబంధాలు దేశంలో పెరుగుతున్నాయంటూ ఇటీవలే ఓ సర్వే వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే వివాహేతర సంబంధాలు ఎలా ఉన్నా, కేవలం సెక్స్ కోసమే అన్నట్లుగా వ్యవహరిస్తూ కొందరు పెళ్లయిన ప్రియురాళ్లు చేస్తున్న ఘాతుకాలు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. భర్తలను చంపుతున్న భార్యల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఏపీలో శనివారం ఒకే రోజు పలు ప్రాంతాల్లో నాలుగు ఘటనలు ఇలాంటివే వెలుగు చూడడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయా ఘటనలు వేర్వేరుగా ఉన్నా, అందరి లక్ష్యం వివాహేతర సంబంధమే కావడం గమనార్హం.
1) తమ్ముడితో కలిసి భర్త హత్య
తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించిన ఓ భార్య, తన భర్తను సోదరుడితో కలిసి దారుణంగా హత్య చేసింది. ప్రకాశం జిల్లాలోని దోర్నాలకు చెందిన అడపాల లాలు శ్రీను, ఝాన్సికి 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే ఝాన్సీకి తన తమ్ముడి స్నేహితుడు సూర్యనారాయణతో వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఈ విషయం తెలిసిన శ్రీను, తాను ప్రస్తుతం గంజాయి కేసులో రిమాండ్‌లో ఉన్నానని, బయటకు వస్తే చంపేస్తానని హెచ్చరించాడు. అయితే ఝాన్సీ ఈ పరిస్థితిని ఎదుర్కొనే బదులు భర్తనే హతమార్చేలా ప్లాన్ చేసింది. తమ్ముడితో కలిసి సుపారీ గ్యాంగుకు డబ్బులు ఇచ్చి, బెయిల్‌పై బయటకు తెచ్చి మరీ భర్తను మట్టుబెట్టించింది.
2) బిర్యానీలో మత్తిచ్చి
తన వివాహేతర సంబంధాన్ని భర్త పసిగట్టాడని భావించిన గుంటూరుకు చెందిన ఓ మహిళ, ప్రియుడితో కలిసి భర్తను అత్యంత పథకం ప్రకారం హత్య చేసింది. భర్త శారీరకంగా బలంగా ఉండటంతో మత్తు టాబ్లెట్లు తెప్పించుకుని, భర్తకు ఇష్టమైన బిర్యానీలో వాటిని కలిపింది.
ఆ తర్వాత మత్తు మందులు అందించిన ఆర్ ఎం పీ వైద్యుడు, ప్రియుడు, ఈమె కలిసి భర్తను గొంతు నులిమి చంపేశారు. ఈ ఘటన కూడా శనివారమే వెలుగులోకి వచ్చింది.
3) ప్రియుడి భార్యకు హెచ్ ఐవీ
ఇది మరో షాకింగ్ ఘటన. కర్నూలుకు చెందిన ఓ యువతి, ఓ యువకుడిని ప్రేమించింది. ఆ యువకుడు వృత్తిరీత్యా వైద్యుడు. కొన్నాళ్లకు అతడు మరో యువతిని, ఆమె కూడా వైద్యురాలే, వివాహం చేసుకున్నాడు. దీంతో కోపం, కసితో యువతి అతడి భార్యపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ చేసింది.
“నావాడు నాకే సొంతం” అంటూ ప్రియుడి భార్యకు హెచ్ ఐవీ ఇంజెక్షన్ ఇచ్చింది. ఈ ఘటన పూర్తిగా ప్రణాళికాబద్ధంగా జరిగింది. వైద్యురాలు బైక్‌పై ఇంటికి వెళ్తుండగా, ప్రియుడి ప్రియురాలు మరో వాహనంతో ఢీకొట్టించి రోడ్డుపై పడేసింది. అనంతరం 108కు ఫోన్ చేసి, ఆమెను లోపలికి ఎక్కిస్తున్న సమయంలో హెచ్ ఐవీ ఇంజెక్షన్ ఇచ్చింది. ఈ ఘటన కూడా శనివారమే వెలుగు చూసింది.
4) ప్రియుడి భార్యకు నిప్పు
తనకు, ప్రియుడికి మధ్య ఉన్న వివాహేతర సంబంధానికి అతడి భార్య అడ్డు వస్తోందని భావించిన ఓ పెళ్లయిన మహిళ, గుంటూరు జిల్లా చేబ్రోలులో ప్రియుడి ఇంటికి నిప్పంటించింది. ఈ ఘటన శనివారం జరిగింది. ఇంటికి నిప్పంటించిన సమయంలో ప్రియుడి భార్య, కుమారుడు, తల్లి ఇంట్లోనే ఉన్నారు.
ఈ ఘటనలో మొత్తం 10 మందికి గాయాలయ్యాయి. మొత్తంగా ఒకే రోజు నాలుగు ఘటనలు జరగడం, అవన్నీ వివాహేతర సంబంధాలతో ముడిపడి ఉండటం ప్రజలను తీవ్రంగా కలచివేసింది.
This post was last modified on January 25, 2026 10:53 pm
మెగాస్టార్ చిరంజీవి ఏ వేదిక మీద మాట్లాడినా.. తన అభిమానుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. అభిమానులే తనకు ఇంధనం అని…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 2026 మొదటి ఆరు నెలలు ఫుల్ ప్యాక్డ్ గా కనిపిస్తున్నాయి. జనవరిలో మన శంకరవరప్రసాద్ గారు…
టీమిండియా సెలక్షన్ లో పేరు లేకుంటే ‘జస్టిస్ ఫర్ సంజు శామ్సన్’ అనే ట్రెండ్ గత రెండేళ్లలో ఎక్కువగా కనిపించింది.…
న్యూజిలాండ్తో జరుగుతున్న టి20 సిరీస్లో మరోసారి టీమిండియా తన విశ్వరూపాన్ని చూపించింది. జనవరి 25న గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఆధ్మాత్మిక చింతన ఎక్కువన్న సంగతి తెలిసిందే. సనాతన ధర్మ పరిరక్షణ కోసం…
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 131 మందికి పద్మ అవార్డుల దక్కాయి. ఐదుగురికి…