Trends

ఇద్దరు తెలుగువారిని వరించిన ‘పద్మశ్రీ’

మన దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో పద్మశ్రీ ఒకటి. కళలు, విద్య, వైద్యం, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ వంటి రంగాల్లోని వ్యక్తులు అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ఇస్తారు. ప్రతి ఏటా రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులను ప్రకటిస్తుంది.

గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డులు అందజేస్తారు. ఈ క్రమంలోనే
2026 ఏడాదికి 45 మందిని పద్మశ్రీ అవార్డుకు కేంద్రం ఎంపిక చేసింది. అందులో, తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ప్రముఖులు ఉన్నారు.

హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) చీఫ్ సైంటిస్ట్ గా, సీడీఎఫ్ డీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ కుమారస్వామి తంగరాజ్‌ ను పద్మశ్రీ వరించింది. జన్యుసంబంధ పరిశోధనలకు గాను ఆయనకు పద్మశ్రీ అవార్డు దక్కింది.

జన్యు సంబంధిత పరిశోధనల్లో తంగరాజ్ ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు. భారతీయ జనాభా జన్యు వైవిధ్యం, దక్షిణ ఆసియా ప్రజల పూర్వీకుల మూలాలను కనుగొనడం, వంశపారంపర్యంగా వచ్చే వ్యాధుల నిర్ధారణ వంటి విషయాల్లో ఆయన చేసిన పరిశోధనలు, అధ్యయనాలు వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి.

మరోవైపు, తెలంగాణకు చెందిన మామిడి రామారెడ్డికి పద్మశ్రీ అవార్డు దక్కింది. పాడి, పశుసంవర్ధక విభాగాల్లో ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపు లభించింది. కర్ణాటకకు చెందిన అంకె గౌడకు సాహిత్యం, విద్య రంగాల్లో పద్మశ్రీ దక్కింది.

అన్‌సంగ్‌ హీరోస్‌ కేటగిరీలో మధ్యప్రదేశ్‌కు చెందిన భగవదాస్ రైక్వార్, జమ్మూకశ్మీర్‌కు చెందిన బ్రిజ్ లాల్ భట్‌, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బుద్రీ థాటి, ఒడిశాకు చెందిన చరణ్ హెంబ్రామ్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన చిరంజీ లాల్ యాదవ్, గుజరాత్‌కు చెందిన ధార్మిక్లాల్ చునీలాల్ పాండ్యాకు పద్మశ్రీ అవార్డు లభించింది.

వీరితో పాటు ఎస్ జీ సుశీలమ్మ, శ్యామ్ సుందర్, చిరంజి లాల్ యాదవ్, ఇంద్రజీత్ సింగ్, రఘువత్ సింగ్, ఆర్. కృష్ణన్, పద్మ గుర్మిత్, అంకె గౌడ, ఆర్మిడ ఫెర్నాండెజ్, భ్రిజ్ లాల్ భట్, భగవాన్ దాస్ రైకర్, టెక్కీ గుబిన్, సురేష్ హనగవాడి, సిమాంచల్ పాత్రో, విశ్వ బంధు, శ్రీరంగ్ దేవబ లాడ్, కాలియప్ప గౌండర్,పోఖిల లేఖేపి, నూరుద్దీన్ అహ్మద్, నరేష్ చంద్ర దేవ్ వర్మ తదితరులకు పద్మశ్రీ అవార్డు దక్కింది.

This post was last modified on January 25, 2026 4:46 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Padmasri

Recent Posts

పది ఓవర్లలోనే చిత్తు చేసిన భారత్

న్యూజిలాండ్‌తో జరుగుతున్న టి20 సిరీస్‌లో మరోసారి టీమిండియా తన విశ్వరూపాన్ని చూపించింది. జనవరి 25న గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం…

13 minutes ago

వైరల్ ఫోటోలు – సర్దార్ ‘పవన్’ సింగ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఆధ్మాత్మిక చింతన ఎక్కువన్న సంగతి తెలిసిందే. సనాతన ధర్మ పరిరక్షణ కోసం…

1 hour ago

తెలుగు ‘పద్మాలు’ వీరే

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 131 మందికి పద్మ అవార్డుల దక్కాయి. ఐదుగురికి…

3 hours ago

ఇద్దరు టాలీవుడ్ దిగ్గజాలకు పద్మ శ్రీ

రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. టాలీవుడ్ సీనియర్ నటుడు, టీడీపీ సీనియర్ నేత, మాజీ…

3 hours ago

ప్రపంచాన్ని ట్రంప్ వణికిస్తుంటే… ఆయన్ను ప్రకృతి వణికిస్తోంది

ఏ ముహుర్తంలో డొనాల్డ్ ట్రంప్ ను రెండోసారి అమెరికాకు అధ్యక్షుడిగా అమెరికన్లు ఎన్నుకున్నారో కానీ.. అప్పటి నుంచి ప్రపంచ దేశాలకు…

4 hours ago

‘ఈసారి తెలంగాణలో వచ్చేది జాగృతి ప్రభుత్వమే’

మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్…

6 hours ago