గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో ఒక భార్య చేసిన ఘాతుకం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రియుడితో తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో భర్తను అత్యంత క్రూరంగా అంతమొందించింది. భర్త చనిపోయిన తర్వాత ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా రాత్రంతా పో**ర్న్ వీడియోలు చూస్తూ గడిపిన ఆమె తీరు పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది.
ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. చిలువూరుకు చెందిన లోకం శివనాగరాజుకు, లక్ష్మీమాధురికి 2007లో వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. విజయవాడలో టికెట్ కౌంటర్‌లో పనిచేసే సమయంలో మాధురికి సత్తెనపల్లికి చెందిన గోపితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసిన మాధురి, ఈ నెల 18న రాత్రి బిర్యానీలో ఏకంగా 20 నిద్రమాత్రలు కలిపి భర్తకు తినిపించింది.
నిద్రమాత్రల ప్రభావంతో భర్త స్పృహ కోల్పోయాక, రాత్రి 11:30 గంటలకు ప్రియుడు గోపి ఇంటికి వచ్చాడు. గోపి నాగరాజు ఛాతీపై కూర్చోగా, మాధురి దిండుతో ముఖంపై అదిమి పట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. హత్య జరిగిన తర్వాత గోపి అక్కడి నుంచి వెళ్ళిపోగా, మాధురి తెల్లవార్లూ ఫోన్‌లో అసభ్యకర వీడియోలు చూస్తూ కాలక్షేపం చేయడం గమనార్హం. తెల్లవారుజామున తన భర్తకు గుండెపోటు వచ్చిందని నాటకమాడింది.
అయితే అంత్యక్రియలకు అరగంట ముందు మృతుడి స్నేహితులు అక్కడికి చేరుకోవడంతో అసలు కథ అడ్డం తిరిగింది. నాగరాజు చెవి నుంచి రక్తం రావడం గమనించిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం రిపోర్టులో ఛాతీ ఎముకలు విరిగి ఉండటం, గాలి ఆడకపోవడం వల్లే మరణం సంభవించిందని తేలడంతో పోలీసులు మాధురిని తమదైన శైలిలో విచారించారు. దీనితో ఆమె తన పాపాన్ని ఒప్పుకుంది.
నేటి తరం సంబంధాల్లో నైతిక విలువలు ఎంతలా పడిపోతున్నాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.
This post was last modified on January 22, 2026 11:05 am
తమిళనాడు రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల వేడి ఇప్పుడే మొదలైంది. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దళపతి…
ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ ఐ-ప్యాక్ (I-PAC) ఆర్థిక లావాదేవీలపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి. 2021లో ఈ సంస్థ హర్యానాలోని…
రాజకీయ రంగప్రవేశానికి ముందు విజయ్ చివరి సినిమాగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న జన నాయకుడుకి కష్టాల కడలి అంత సులభంగా…
మార్చి 27 విడుదలని ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చిన పెద్ది ఖచ్చితంగా వాయిదా పడుతుందనే రీతిలో సోషల్ మీడియాలో ఒక…
మన శంకర వరప్రసాద్ గారుకి ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు నుంచి రెగ్యులర్ టికెట్ ధరలు అందుబాటులోకి వచ్చేశాయి. జిఓలో…
మరో ఆరు రోజుల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కీలకంగా అమరావతి రాజధానికి…