అంతర్జాతీయ క్రికెట్లో అప్పుడప్పుడూ కొన్ని ఆసక్తికర ఉదంతాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఒక సీనియర్ ఆటగాడికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లేదా ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు ఇస్తే.. వాటికి తమ కంటూ జూనియర్లు అర్హులని, వారిదే మెరుగైన ప్రదర్శన అని కొందరు సీనియర్లు వాళ్ల చేతిలో పెట్టేస్తుంటారు. ఇలాంటి ఉదంతాలు అరుదుగానే జరుగుతుంటాయి. చాలా కాలం తర్వాత అలాంటి దృశ్యం.. భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ ముగింపు సందర్భంగా చోటు చేసుకుంది.
భారత జట్టు 2-1తో సిరీస్‌ను గెలుచుకోవడంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా రెండో టీ20లో అతడి మెరుపు ఇన్నింగ్సే జట్టును గెలిపించింది. తొలి టీ20లోనూ అతను చెప్పుకోదగ్గ ఇన్నింగ్సే ఆడాడు. ఈ నేపథ్యంలోనే అతడికి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ ఇచ్చారు. కానీ అతను మాత్రం ఆ అవార్డుకు తాను అర్హుడిని కాదు అనేశాడు.
ఈ సిరీస్‌తోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టి వరుసగా మెరుపు బౌలింగ్ ప్రదర్శనలతో అందరి దృష్టినీ ఆకర్షించిన తమిళనాడు లెఫ్టార్మ్ పేసర్ నటరాజన్‌కు హార్దిక్ తన ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ ఇచ్చేశాడు. తొలి రెండు టీ20ల్లో రెండు చొప్పున వికెట్లతో నటరాజన్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. రెండో టీ20లో హార్దిక్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కగా.. అప్పుడే అతను ఇందుకు తాను కాదు, నటరాజనే అర్హుడు అని వ్యాఖ్యానించాడు.
మిగతా బౌలర్లందరూ విఫలమైన పిచ్ మీద ఎంతో పొదుపుగా బౌలింగ్ చేయడమే కాక రెండు కీలక వికెట్లు తీసిన నటరాజన్‌కే ఆ అవార్డు దక్కాలన్నాడు. ఇక మూడో టీ20లో భారత్ ఓడినప్పటికీ సిరీస్ సొంతం కాగా.. బహుమతి ప్రదానోత్సవంలో తనకు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం అందిస్తే దాన్ని తీసుకెళ్లి నేరుగా నటరాజన్ చేతిలో పెట్టేసి తన క్రీడా స్ఫూర్తిని చూపించాడు. ఇలాంటి టీమ్ స్పిరిట్, పెద్ద మనసు అందరికీ ఉండదంటూ హార్దిక్ మీద సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.
This post was last modified on December 9, 2020 2:06 pm
సహజంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తారు. ముందు మాటలతో.. తర్వాత తమదైన లాఠీ శైలితోనూ…
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…