ఎలాన్ మస్క్.. ఈ కాలంలో ఆయన పేరు తెలియనివారు ఉండరు. టెస్లా, స్పేస్‌ఎక్స్, ట్విట్టర్ (ఎక్స్),ఎక్స్ ఏఐ వంటి కంపెనీలకు నాయకత్వం వహించి గుర్తింపు పొందారు. ఆయన దక్షిణాఫ్రికాలో జన్మించిన కెనడియన్- అమెరికన్ వ్యాపారవేత్త, ఇంజనీర్. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరు. ఎప్పుడూ వార్తల్లో ఉండే ఆయన తాజాగా భారతీయ మూలాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు పేరులో శేఖర్ అని ఉండడంతో పాటు పలు విషయాలను వెల్లడించారు. మాస్క్ భాగస్వామి, న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ అయిన శివోన్ జిలిస్. ఆమెకు భారతీయ మూలాలు ఉన్నాయి.
ఆమెకు పూర్వీకుల ద్వారానే భారత్‌తో సంబంధం ఉంది, శివోన్ జిలిస్ కెనడాలోనే పెరిగారని మస్క్ స్పష్టం చేశారు. చాలాకాలంగా టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల్లో నిపుణురాలిగా పనిచేస్తున్నారు. వారి కుమారుల్లో ఒకరికి నోబెల్ బహుమతి గ్రహీత, భారత సంతతికి చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ గౌరవార్థం ‘శేఖర్’ అని మధ్య పేరుగా పెట్టామని వెల్లడించారు.
నక్షత్రాల పరిణామ క్రమంపై చేసిన విశేష పరిశోధనలకు గానూ సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ 1983లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. అమెరికాలోని భారతీయ నిపుణులపై కూడా మస్క్ ప్రశంసలు కురిపించారు. వారి వల్ల అమెరికాకు ఎంతో ప్రయోజనం కలిగిందని అన్నారు. అయితే, హెచ్-1బీ వీసా వ్యవస్థను కొందరు దుర్వినియోగం చేశారని కూడా చెప్పారు. జెరోధా సంస్థ సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్ కాస్ట్‌లో పాల్గొన్న మస్క్ అనేక అంశాలపై తన మనసులో మాటను పంచుకున్నారు.
This post was last modified on December 1, 2025 10:29 am
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…