Trends

నిజం: ‘8’ కోసం.. ‘కోటి’ రూపాయ‌లు

సెంటిమెంటు ఉండొచ్చు. కానీ.. దానికి కూడా కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఉండాలి కూడా. కానీ.. రాను రాను ఈ సెంటిమెంటు పిచ్చి ముదురుతోంది. ఇది చేస్తే జీవితం మారుతుంది.. అది చేస్తే.. పెళ్లి జ‌రుగుతుంది.. అని విశ్వ‌సిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా అసోచాం సంస్థ చేసిన అధ్య‌య‌నంలో దేశంలో పూజ‌లు, వ్ర‌తాలు చేసుకునే వారు పెరుగుతున్న‌ట్టు తెలిసింది. అయితే.. వీరిలో వృద్ధులు, గృహిణుల కంటే కూడా.. ఐటీఉద్యోగాలు చేసుకుంటున్న యువ‌తీయువ‌తులు పెరుగుతున్న‌ట్టు తేల‌డం విశేషం.

కార‌ణం ఏదైనా.. శుక్ర‌వారాలు, మంగ‌ళ‌వారాల సెంటిమెంటుతో పాటు.. ఇప్పుడు మూహూర్తాలు, టైం కు కూడా సెంటిమెంటు వ‌చ్చి చేరింది. ఇది గ‌మ‌నించే ఏమో.. ప్ర‌ఖ్యాత మీడియా సంస్థ‌లు కూడా.. ‘జాత‌కాల’పై ప్ర‌త్యేక పేజీల‌ను నిర్వ‌హిస్తున్నాయి. స‌మ‌స్య మీది.. ప‌రిష్కారం మాది అంటూ.. పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల సెంటిమెంటుకు.. మ‌రింత దోహ‌ద‌ప‌డుతున్నాయి. ఈ సెంటిమెంటు ప‌రంప‌ర ఎక్క‌డి వ‌ర‌కు చేరిందంటే.. ఓ వ్య‌క్తి ఏకంగా.. ఫ్యాన్సీ నెంబ‌రు కోసం కోటీ 17 ల‌క్ష‌ల 12 వేల రూపాయ‌ల‌కుపైగా.. చెల్లించే వ‌ర‌కు చేరింది.

ఆశ్చ‌ర్యంగా ఉన్నా నిజం.. వాహ‌నాలు కొనుగోలు చేసేవారు.. నెంబ‌ర్ సెంటిమెంటును(న్యూమ‌రాల‌జీ) న‌మ్ముకుంటున్నారు. ఈ క్ర‌మంలో త‌మ వాహ‌నాల‌కు ఉండే రిజిస్ట్రేష‌న్ నెంబ‌రు విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌డం లేదు. ఇక‌, వినియోగ‌దారుల సెంటిమెంట‌ను ఆయా రాష్ట్రాల రోడ్డు ర‌వాణా శాఖ‌లు క్యాష్ చేసుకుంటున్నాయి. ఇలానే.. తాజాగా హ‌రియాణా రోడ్డు ర‌వాణా సంస్థ కూడా.. బుధ‌వారం నిర్వ‌హించిన‌.. నెంబ‌ర్ల వేలం పాట‌లో ఆ శాఖ‌కు ఊహించ‌ని విధంగా సొమ్ము వ‌చ్చి చేరింది.

‘HR88B8888’ రిజిస్ట్రేషన్ నంబర్ కోసం హ‌రియాణా ఆర్టీఏ అధికారులు నిర్వ‌హించిన వేలం పాట‌లో ఓ వ్య‌క్తి ఏకంగా కోటీ 17 ల‌క్ష‌ల రూపాయ‌ల పైచిలుకు మొత్తం వెచ్చించి.. ఈ నెంబ‌రును కైవ‌సం చేసుకున్నారు. వాస్త‌వానికి అధికారులు రూ.10-20 ల‌క్ష‌ల లోపే ఇది ప‌లుకుతుంద‌ని అనుకున్నారు. అందుకే.. దీనికి ప్రారంభ పాట‌గా.. రూ.50 వేలు నిర్ణ‌యించారు. కానీ, ‘8 సెంటిమెంటు కావ‌డంతో ఓ వ్య‌క్తి దీనిని కోటికి పైగా వెచ్చించి ద‌క్కించుకున్నారు. ఇది.. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో నెంబ‌ర్లు కొనుగోలు చేసిన వారిలో రికార్డు అని అధికారులు పేర్కొన్నారు.

8- ప్ర‌త్యేక‌త ఏంటి?

సంఖ్యా శాస్త్రంలో 9 కి ఉన్న ప్ర‌త్యేక‌త అంద‌రికీ తెలిసిందే. కానీ, వాహ‌నాలు, ర‌వాణా రంగానికి సంబంధించి 6, 8 సంఖ్య‌ల‌కు కూడా ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ నేప‌థ్యంలో 8 సంఖ్య‌కు ఉన్న ప్ర‌త్యేక‌త‌ను చూస్తే.. ఇది అనేక సంప్రదాయాలలో అదృష్ట లేదా శుభ సంఖ్యగా పరిగణిస్తున్నారు. ఇది చైనీస్ సంస్కృతిలో సంపద, ఇత‌ర దేశాల‌లో కొత్త ప్రారంభాలకు శుభ‌సూచ‌కంగా ఉంటుది. దీని క్షితిజ సమాంతర ధోరణి అనంత చిహ్నాన్ని పోలి ఉంటుంది, ఇది శాశ్వతత్వం.. అపరిమిత సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఎందుకంటే.. 8 సంఖ్య ఎక్క‌డా ‘అంతం’ కాక‌పోవ‌డ‌మే పెద్ద ప్ల‌స్‌. ఇత‌ర సంఖ్య‌లు ఎండ్ అవుతాయి. కానీ, 8 అలా ఎండ్ కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అందుకే దీనికి ప్రాధాన్యం ఉంది.

This post was last modified on November 28, 2025 6:55 am

Share

Recent Posts

గుంత కనిపిస్తే AI చూసుకుంటుంది

రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడం వరకు చాలామంది చేస్తుంటారు. కానీ ఆ గుంతను బాగు…

10 minutes ago

ప్రభాస్ ఫ్యాన్స్ అయోమయం తీర్చాల్సిందే

ఫౌజీ వాయిదా పడింది. సంతోషం. ఇలాంటి పోస్టుపోన్లు చూడటం కొత్తేమి కాదు కాబట్టి అందులో ఫీలవ్వడానికి ఏం లేదు. మరి…

48 minutes ago

రోడ్డుపై పడుకొని ప్రియాంకా గాంధీ నిరసన

ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో వివాదాల నేపథ్యంలో ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కాక్రోచ్…

1 hour ago

ఫుట్ పాత్ లపై ట్రాన్స్ ఫార్మర్లేంది స్వామీ?

మన దేశంలో పాదచారుల కోసం రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఫుట్ పాత్ ల మీద బడ్డీ కొట్లు మొదలు...జ్యూస్…

2 hours ago

రేవంత్ ఫాంహౌస్ పాచిక పెద్దదే

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ ను నిశితంగా చూస్తే..ఆయనలో తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పని చేసిన అధినేతల నీడలు కొట్టొచ్చినట్లు…

2 hours ago

శివన్న ‘బెయిల్’కి ప్రేమ దెబ్బ పడింది

జైలర్ తో శివరాజ్ కుమార్ మనకూ దగ్గరయ్యారు. పెద్దిలో రామ్ చరణ్ గురువుగా నటించి దానికీ ప్లస్ అయ్యారు. గౌతమీపుత్ర…

3 hours ago