కరోనా ప్రభావం అసలేమాత్రం లేనట్లే ఉంది మన దగ్గర జనాల తీరు. మన దగ్గరే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. అన్ని వ్యవహారాలూ యధావిధిగా నడిచిపోతున్నాయి. మాస్కులు, శానిటైజర్ల వాడకాన్ని కూడా లైట్ తీసుకునే పరిస్థితి వచ్చేసింది. జనాలు ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారు.
మొన్న జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఒకేచోట వందలు, వేలమంది గుమికూడిన దృశ్యాలు ఎన్నో చూశాం. సభలు, సమావేశాలు అన్నీ మామూలుగానే నిర్వహించేస్తున్నారు. అసలు కరోనా ఉనికే లేనట్లుగా ఉంది. ఐతే మునుపటితో పోలిస్తే కరోనా ప్రభావం తగ్గి ఉండొచ్చు కానీ.. దాని ప్రభావాన్ని పూర్తిగా కొట్టి పారేయొద్దని, సెకండ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నా ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇలాగే లైట్ తీసుకున్న అమెరికా ఇప్పుడు మళ్లీ భయం గుప్పెట్లోకి వెళ్తోంది.
ఒక్క రోజులో అమెరికాలో కరోనా వల్ల 3157 మంది చనిపోయారంటే నమ్మశక్యంగా అనిపించదు. ఇది గతానికి సంబంధించిన విషయం కాదు. తాజా అప్‌డేటే. కరోనా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఉన్న రోజుల్లో కూడా 24 గంటల్లో ఇన్ని మరణాలు నమోదు కాలేదు. ఏప్రిల్ 24న ఆ దేశంలో 2603 మరణాలు నమోదయ్యాయి. అది అప్పటికి ప్రపంచ రికార్డు. ఇప్పుడు అంతకంటే 550+ మరణాలు అధికంగా చోటు చేసుకున్నాయంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో 24 గంటల వ్యవధిలో లక్ష మందికి పైగా కరోనాతో ఆసుపత్రుల్లో చేరడం గమనార్హం. గత నెల ఎన్నికల తాలూకు ప్రభావాన్నే అమెరికన్లు ఇప్పుడు చూస్తున్నారని, పరిస్థితి విషమిస్తోందని అక్కడి నిపుణులు అంటున్నారు. రాబోయే 3 నెలలు కఠిన పరిస్థితులు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
రష్యాలో సైతం ఒకేసారి రోజువారీ కేసులు పది రెట్లు పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇండియాలో కూడా కొంత విరామం తర్వాత కేసుల సంఖ్య పెరుగుతోందని.. ఇప్పుడు జాగ్రత్త వహించకపోతే మళ్లీ కరోనా తీవ్ర రూపం దాల్చడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
This post was last modified on December 4, 2020 2:48 pm
రేపు, ఎల్లుండి బాక్సాఫీస్ కు నాలుగు కొత్త రిలీజులు ఉన్నాయి. మాములుగా అయితే సందడి ఓ రేంజ్ లో ఉండాలి.…
నాయకుడు అన్న వ్యక్తి.. హుందాగా వ్యవహరించాలి. పైగా.. గతంలో ఉన్నస్థాయి పదవులు అలంకరించిన వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే..…
భారత రిజర్వ్ బ్యాంకు బుధవారం దేశ ప్రజలకు మరోమారు తీపి కబురు చెప్పింది. ఇప్పటికే గత త్రైమాసిక సమీక్షలో భాగంగా…
బాలీవుడ్ మొదటి సూపర్ హీరో బ్లాక్ బస్టర్ గా నిలిచిన క్రిష్ కు కొనసాగింపుగా క్రిష్ 4 త్వరలో ప్రారంభం…
ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పాలనను డిటిజల్ రూపంలోకి మారుస్తున్నారు. ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా.. చేసిన ప్రయోగం సక్సెస్…
అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, విపక్షంలోకి మారితే మరోలా మాట్లాడుతున్న వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుపై పోలీసు…