ఢిల్లీని రక్తమోడించిన ఎర్రకోట పేలుడు కేసులో ఒళ్లు గగుర్పొడిచే నిజం బయటపడింది. 13 మంది ప్రాణాలు తీసిన ఆ బాంబును ఉగ్రవాది ఉమర్ మహమ్మద్ ఎక్కడో తయారు చేసుకుని రాలేదు. నడిరోడ్డు పక్కన, పబ్లిక్ పార్కింగ్‌లోనే కూర్చుని దర్జాగా బాంబును రెడీ చేశాడని తెలుస్తోంది. ఎర్రకోట దగ్గరున్న సునేహ్రి మసీదు పార్కింగ్‌లో దాదాపు మూడు గంటల పాటు కారులోనే ఉండి, అందరి కళ్లుగప్పి ఈ మరణ మృదంగాన్ని సిద్ధం చేశాడని దర్యాప్తులో తేలింది.
అసలు పేలుడుకు ముందు ఉమర్ ఆ మూడు గంటలు ఏం చేశాడన్నదే పోలీసులకు ఇన్నాళ్లు మిస్టరీగా ఉంది. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం.. మధ్యాహ్నం 3:19 గంటలకు పార్కింగ్‌లోకి వచ్చిన ఉమర్, సాయంత్రం 6:28 గంటల వరకు కారు దిగలేదు. ఆ మూడు గంటల పాటూ అతను తన హ్యాండ్లర్లతో టచ్‌లోనే ఉన్నాడు. టార్గెట్ ఏంటి? ఎక్కడ పేల్చాలి? అనే విషయాలపై కారులో నుంచే చర్చిస్తూ, అక్కడికక్కడే పేలుడు పదార్థాలను అమర్చాడని అధికారులు నిర్ధారించారు.
నిజానికి ఉగ్రవాదుల అసలు ప్లాన్ వేరే ఉంది. ఎర్రకోట పార్కింగ్‌లోనే బాంబు పేల్చాలని ముందుగా స్కెచ్ వేశారు. దానికి తగ్గట్టే ఉమర్ మయూర్ విహార్, కన్నాట్ ప్లేస్ మీదుగా పాత ఢిల్లీ చేరుకున్నాడు. కానీ, ఆ రోజు సోమవారం కావడంతో ఎర్రకోట సందర్శకులకు సెలవు. దీంతో పార్కింగ్ ఏరియా మొత్తం ఖాళీగా ఉంది. జనం లేని చోట పేల్చి లాభం లేదని గ్రహించిన ఉమర్, తన హ్యాండ్లర్ల సూచనతో ప్లాన్ మార్చాడు. జనం రద్దీగా ఉండే నేతాజీ సుభాష్ మార్గ్ వైపు కారును పోనిచ్చి, అక్కడ విధ్వంసం సృష్టించాడు.
ఇంత అర్జెంట్‌గా, పబ్లిక్ ప్లేస్‌లో రిస్క్ తీసుకుని మరీ బాంబు ఎందుకు తయారు చేశాడనే దానికి బలమైన కారణమే ఉంది. ఫరీదాబాద్‌లో 2,900 కిలోల పేలుడు పదార్థాలతో తన సహచరులు (డాక్టర్లు) ముజమ్మిల్, షాహీన్‌లు పట్టుబడ్డారు. వాళ్లు దొరికిపోవడంతో, పోలీసులు తనదాకా రావడం ఖాయమని ఉమర్ భయపడ్డాడు. పానిక్ అయిపోయాడు. అందుకే దొరికిపోయే లోపే ఏదో ఒక ఘోరం చేయాలనే కసితో, కంగారుగా ఢిల్లీకి వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టాడు.
పార్కింగ్‌లో బాంబు పని పూర్తి కాగానే, 6:28కి బయటకు వచ్చిన ఉమర్.. సరిగ్గా 24 నిమిషాల్లోనే (6:52 గంటలకు) పేలుడు జరిపాడు. క్షణాల్లో ఆ ప్రాంతం మరణహోమంగా మారిపోయింది. ఉమర్ పానిక్ రియాక్షన్ వెనుక ఇంత కథ నడిచిందని తెలిసి దర్యాప్తు అధికారులే షాక్ అవుతున్నారు. డాక్టర్ చదువు చదివి, ప్రాణాలు తీసే టెర్రరిస్ట్‌గా మారిన ఉమర్ చర్య ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
This post was last modified on November 19, 2025 12:24 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…