విన్నంతనే ఉలిక్కిపడే ఉదంతం ఒకటి మానుకోట జిల్లా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వైద్యం కోసం వచ్చిన వ్యక్తి సొమ్మసిల్లి పడిపోతే.. చనిపోయినట్లుగా భావించి మార్చురీలో పడేసిన దారుణ వైనం షాక్ కు గురి చేస్తోంది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకూ అసలేం జరిగిందంటే..
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలానికి చెందిన రాజు అనే వ్యక్తి మోకాళ్లు.. నడుం నొప్పులతో బాధ పడుతూ వారం క్రితం వైద్యం కోసం మానుకోట జిల్లా ఆసుపత్రికి వచ్చాడు. అయితే.. అతడి వద్ద ఆధార్ కార్డు లేకపోవటంతో అతడ్ని ఆసుపత్రిలో చేర్చుకునేందుకు అనుమతించలేదు. దీంతో రెండు రోజుల పాటు ఆసుపత్రి క్యాంటీన్ ఆవరణలోనే ఉండిపోయాడు.
ఆసుపత్రి సిబ్బంది తనను కరుణించి.. వైద్యం చేస్తారని భావిస్తూ అక్కడే ఉండిపోయాడు. ఎలాంటి వైద్య సాయం అందకపోవటం.. ఆహారం అందకపోవటంతో నీరసించిపోయాడు. క్యాంటీన్ ఆవరణలోనే స్ర్పహ తప్పిపోయాడు. అచేతన స్థితిలో ఉన్న రాజును చూసి అతడు మరణించినట్లుగా భావించిన ఆసుపత్రి సిబ్బంది అతన్ని మార్చురీకి తీసుకెళ్లారు. అక్కడ బాక్సులు ఖాళీ లేకపోవటంతో అతడ్ని మార్చురీ ప్రాంగణంలో గేట్ వద్ద ఉంచేశారు. తర్వాతి రోజు మార్చురీ క్లీన్ చేసేందుకు వచ్చిన సిబ్బంది బాధితుడిలో కదలికల్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఉదంతం గురించి సమాచారం అందుకున్న ఆసుపత్రి సిబ్బంది వెంటనే అత్యవసర వార్డుకు తరలించి చికిత్స చేస్తున్నారు.
This post was last modified on October 31, 2025 12:59 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…