అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలిచిన జో బైడెన్ కు చుక్కలు చూపిస్తున్నారు. ఓసారి అద్యక్షునిగా తానే గెలిచానని చెబుతారు. మరోసారి బైడెన్ గెలుపును తాను అంగీకరించేది లేదని ప్రకటించారు. ఎప్పటికీ తాను వైట్ హౌస్ ను ఖాళీ చేసేది లేదని చెప్పారు. ఈ మధ్య సరే కానీండి తాను ఓటమిని అంగీకరించకపోయినా అధికారాన్ని బదిలీ చేయటానికి ఒప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ట్రంప్ ప్రకటనతో వైట్ హౌస్ ఉన్నతాధికారులు మొత్తానికి ఊపిరి పీల్చుకున్నారు.
అయితే ఈ ముచ్చట జరిగి ఎన్నో రోజులు కాలేదు. తాజాగా తాను వైట్ హౌస్ ను ఖాళీ చేసేది లేదని తెగేసి చెప్పారు. తాను అధ్యక్ష భవనాన్ని ఖాళీ చేయాలంటే అందుకు కొన్ని షరతులను విధించటమే విచిత్రంగా ఉంది. ఇంతకీ ఆ షరతులు ఏమిటయ్యా అంటే బైడెన్ గెలిచినట్లుగా ఎలక్టోరల్ కాలేజీ ధృవీకరిస్తే మాత్రమే తాను శ్వేతసౌదాన్ని విడుస్తానంటూ కొత్త మెలిక పెట్టారు.
ఈమద్యనే జరిగిన ఎన్నికల్లో 50 రాష్ట్రాల్లో 528 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. అధ్యక్షునిగా గెలవాలంటే 270 ఓట్ల మార్కును దాటాలి. అయితే బైడెన్ కు 306 ఓట్లు వచ్చాయి. ట్రంపుకు 232 ఓట్లొచ్చాయి. మరి దీని ప్రకారం బైడెన్ గెలుపు స్పష్టంగానే కనబడుతోంది. అయితే డిసెంబర్ 14వ తేదీన కొత్తగా ఎన్నికైన ఎలక్టోర్స్ భేటి అవుతున్నారట. ఆ సమావేశంలో అందరు కలిసి తమ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.
డిసెంబర్ 14వ తేదీన జరగబోయే ఎలక్టోర్స్ సమావేశం ఎన్నికలో బైడెన్ తన ఆధిక్యాన్ని నిరూపించుకోవాలంటూ ట్రంప్ సవాలు విసురుతున్నారు. మొన్నటి ఎన్నికల ఫలితాలను బట్టి బైడెన్ ఎన్నిక కేవలం లాంఛనం మాత్రమే. అయితే మరి ట్రంప్ ఏ ధైర్యంతో సవాలు విసురుతున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. లేకపోతే డిసెంబర్ 14న జరగబోయే సమావేశంలో ట్రంప్ ఏదైనా కిరికిరి ప్లాన్ చేస్తున్నారా అన్నదే అర్ధం కావటం లేదు. దాంతో ఇఫుడు అందరి దృష్టి డిసెంబర్ 14 సమావేశంపైనే పండిది. మరి ఆ రోజు ఏమవుతుందో ఏమో చూడాల్సిందే.
This post was last modified on November 28, 2020 11:48 am
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…