Trends

ఐసీసీ నుంచి పాక్‌కు మరో షాక్‌

ఆసియా కప్ 2025లో ఇండియా – పాక్ మ్యాచ్ తర్వాత చోటు చేసుకున్న “నో హ్యాండ్‌షేక్” వివాదం ఊహించని స్థాయికి చేరింది. ఈ అవమానాన్ని తట్టుకోలేని పాక్ క్రికెట్ బోర్డు (PCB) ఇండియన్ జట్టుపైనే కాకుండా మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌పై కూడా ఆరోపణలు చేసింది. టాస్ సమయంలో సూర్యకుమార్ యాదవ్‌తో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ చేతులు కలపకూడదని పైక్రాఫ్ట్ ఆదేశించారని పాక్ ఆరోపించింది. అందుకే ఆయన్ని వెంటనే రిఫరీ ప్యానెల్ నుంచి తొలగించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేసింది.

అయితే ఈ డిమాండ్‌కు ఐసీసీ తక్షణమే స్పందించి పాక్‌కు పెద్ద షాక్ ఇచ్చింది. రిఫరీపై ఎలాంటి చర్య తీసుకోలేమని స్పష్టం చేసింది. పైక్రాఫ్ట్‌ను తొలగించే అభ్యర్థనను తిరస్కరించినట్లు ఒక ICC అధికారి మీడియాకు తెలిపాడు. ఈ నిర్ణయం పాక్‌కు మరో అవమానం కావడంతో ఇప్పుడు అక్కడి క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోహ్సిన్ నక్వీ, “ఈ రిఫరీ ప్రవర్తన ఆట తీరుకు వ్యతిరేకం. MCC చట్టాలను ఉల్లంఘించాడు” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అంతే కాకుండా, UAEతో జరిగే తమ తదుపరి మ్యాచ్‌ను కూడా బహిష్కరిస్తామని అన్నట్లు కథనాలు వచ్చాయి. అయితే ఈ వివరణ అధికారిక ప్రకటనగా రాలేదని తెలుస్తోంది, పాక్ మీడియా మాత్రమే రిపోర్ట్ చేసిందట.

ప్రస్తుతం పాక్ జట్టు ఆసియా కప్ సూపర్-4కి చేరాలంటే UAEపై తప్పనిసరిగా గెలవాలి. ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌ల్లో ఒకటే గెలిచిన పాక్, UAEను ఓడిస్తేనే తదుపరి రౌండ్‌లోకి ప్రవేశిస్తుంది. గెలిస్తే మళ్లీ ఆదివారం ఇండియానే ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి హ్యాండ్‌షేక్ వివాదం కొనసాగుతున్నా, మైదానంలో పాక్ జట్టుకు గెలుపే ప్రధాన సవాలు. మరోవైపు భారత జట్టు మాత్రం మైదానంలో గెలుపుతో, మైదానం బయట సైలెంట్ కౌంటర్‌లతో ముందుకు సాగుతోంది. ఇప్పుడు ఫ్యాన్స్ కళ్లన్నీ సెప్టెంబర్ 17న జరిగే పాక్ UAE పోరుపైనే నిలిచాయి. అక్కడి ఫలితమే ఈ ఆసియా కప్‌లో మరో ఇండియా – పాక్ మ్యాచ్ కి ప్రణాలిక సిద్ధం చేయనుంది.

This post was last modified on September 16, 2025 1:32 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

56 minutes ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

4 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

4 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

6 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

8 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

9 hours ago