Trends

పహల్గాం ఉగ్రదాడి… ఇండియన్ కెప్టెన్ క్లీన్ మెసేజ్

ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై ఘన విజయాన్ని అందుకున్న టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ తన మాటలతో అభిమానులను కట్టిపడేశాడు. దుబాయ్ వేదికగా ఆడిన మ్యాచ్‌లో అద్భుత విజయానంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు కేవలం క్రికెట్‌కే పరిమితం కాలేదు. ఈ సారి సూర్య తన గెలుపు సంతోషాన్ని పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు అంకితం చేయడం విశేషంగా మారింది.

మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్య, “ఇది మా కోసం మరో గేమ్ మాత్రమే. కానీ ఈ ప్రత్యేక సందర్భంలో పహల్గాం ఉగ్రదాడి బాధితుల కుటుంబాల పక్కన నిలబడ్డామని చెప్పాలనుకుంటున్నాను. మా ఆర్మీ బలగాలు చూపిన ధైర్యసాహసాలకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం. మైదానంలో మా గెలుపుతో, వారి ముఖాల్లో చిరునవ్వు చూడాలని ఆశిస్తున్నాం” అని చెప్పి అందరినీ కదిలించాడు.

చివరి వరకు నిలబడి జట్టును గెలిపించడం తనకు ప్రత్యేక అనుభూతి అని తెలిపారు. ప్రతి మ్యాచ్‌ కోసం ఒకే విధమైన సన్నద్ధతతో ముందుకెళ్లడమే తమ తత్వమని చెప్పారు. స్పిన్నర్లు మధ్య ఓవర్లలో మ్యాచ్‌ను కట్టిపడేయడం ఎప్పటినుంచో తనకు ఇష్టమని తెలిపారు. భారత్ గెలుపుతో ఉత్సాహంగా ఉన్నా, సూర్య మాటల్లో ఒక గంభీరత స్పష్టంగా కనిపించింది. 

దేశం ఎదుర్కొంటున్న పరిస్థితులను గుర్తు చేస్తూ, ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఓదార్పునిచ్చేలా వ్యాఖ్యలు చేశారు. క్రీడ ద్వారా దేశానికి గౌరవం తీసుకురావడమే కాకుండా, సైన్యం ధైర్యాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తామన్న సంకేతాన్ని ఇచ్చారు. మొత్తంగా చూస్తే, ఈ మ్యాచ్ విజయం కేవలం ఒక విజయమే కాదు. అది ఒక భావోద్వేగ అంకితం కూడా అని టీమిండియా క్లియర్ మెసేజ్ ఇచ్చింది.

This post was last modified on September 15, 2025 11:23 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

1 hour ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

2 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

2 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

3 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

4 hours ago