బిగ్ బాస్ షో చూపిస్తూ సంక్లిష్టమైన బ్రెయిన్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు గుంటూరు వైద్యులు. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ రియాల్టీ షో చూపిస్తూ.. అతడిని మాట్లాడిస్తూ సర్జరీని పూర్తి చేశారు. ఎందుకిలా? అంటే.. దానికి కారణం లేకపోలేదు.
గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలానికి చెందిన 33 ఏళ్ల ప్రసాద్ కు బ్రెయిన్ ట్యూమర్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. 2016లో హైదరాబాద్ లో సర్జరీ చేసి కణితిని తొలగించారు. ఆ తర్వాత పలుమార్లు రేడియేషన్ ఇచ్చారు. అయినప్పటికీ కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. తరచూ ఫిట్స్ రావటంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అతడ్ని గుంటూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చూపించారు. ఈ సందర్భంగా చేసిన టెస్టుల్లో మెదడులో మళ్లీ కణితి పెరిగినట్లుగా గుర్తించారు. దీంతో మరోసారి సర్జరీ చేసేందుక సిద్ధమయ్యారు. త్రీడీ మ్యాప్ తో కణితి ఎక్కడ ఉందో గుర్తించి.. సరిగ్గా అక్కడే బ్రెయిన్ ఓపెన్ చేశారు.
ఈ సర్జరీలో సంక్లిష్టత ఏమిటంటే.. ఆపరేషన్ చేసే సమయంలో రోగిని స్పృహలో ఉంచే సర్జరీ చేయాలి. ఎందుకంటే.. మెదడులోని సంభాషణలకు సంబంధించిన ప్రాంతంలో సర్జరీ జరుగుతుండటంతో.. అతడికి బిగ్ బాస్ షోతో పాటు.. అవతార్ సినిమా చూపిస్తూ.. తరచూ మాట్లాడిస్తూ ఆపరేషన్ పూర్తి చేశారు. ఈ సర్జరీ సక్సెస్ అయినట్లుగా వైద్యులు వెల్లడించారు. తాజాగా ఇతన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. రోగి ఆసక్తి మేరకు బిగ్ బాస్ షో చూపించినట్లుగా తెలుస్తోంది.
This post was last modified on November 21, 2020 10:59 am
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…