Trends

జీఎస్టీ ఎఫెక్ట్‌: క‌ర్ణాట‌క‌లో కాఫీ, టీలు బంద్‌!

దేశంలో అత్య‌ధికంగా కాఫీ, టీలు విక్ర‌యించే, వినియోగించే వారి జాబితాలో క‌ర్ణాట‌క తొలిస్థానంలో ఉంది. ఇది జాతీయ గ‌ణాంకాలు చెబుతున్న లెక్క‌. రెండోస్థానంలో రాజ‌స్థాన్ ఉండ‌గా.. మూడో స్థానంలో పంజాబ్‌, నాలుగులో ఏపీ ఉన్నాయి. అయితే.. తాజాగా క‌ర్ణాట‌క‌లోని అన్ని ప్ర‌ముఖ టీ, కాఫీ విక్ర‌యాలు జ‌రిపే.. హోట‌ళ్లు, క్యాంటీన్లు.. వాటి విక్ర‌యాల‌ను నిలిపివేశాయి. ఈ మేర‌కు బోర్డులు కూడా పెట్టాయి. ఇక‌, ఆయా హోట‌ళ్లు, కేఫ్‌ల‌లో బ్లాక్ టీ మాత్రమే విక్ర‌యిస్తున్నారు. అది కూడా నిర‌స‌న‌గా మాత్రమేన‌ని కొంద‌రు వ్యాపారులు తెలిపారు. దీనికి తోడు.. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి న‌గ‌దు లావాదేవీల‌ను కూడా ఆయా హోట‌ళ్లు నిలిపివేశాయి.

దీనికి కార‌ణం.. కాఫీ, టీ విక్ర‌యాల‌పై కేంద్రం జీఎస్టీ బాదేస్తోంది. గ‌త ఏడాది 12 శాతం ఉన్న జీఎస్టీ వ‌సూళ్ల‌ను ఈ ఏడాది 18 శాతానికి పెంచారు. ఇది విక్ర‌యదారుల‌కు, హోట‌ళ్ల య‌జ‌మానుల‌కు తీవ్ర సంక‌టంగా మారింది. మ‌రోవైపు.. న‌గ‌దు లావాదేవీ ల‌కు సంబంధించి ఆదాయ ప‌న్ను అధికారులు, జీఎస్టీ అధికారుల నుంచి నోటీసులు రావ‌డాన్ని విక్ర‌య‌దారులు తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. జీఎస్టీ అధికారులు తమను లక్ష్యంగా చేసుకొని నోటీసులు పంపిస్తున్నాని.. పేర్కొంటున్నారు. ఈ క్ర‌మంలోనే విక్ర‌యాలు నిలిపివేస్తున్నామ‌ని వ్యాపారులు తెలిపారు.

అధికారుల వాద‌న ఇదీ..

జీఎస్టీ అధికారులు ఈ వివాదంపై స్పందించారు. 2021 నుంచి 2024 ఆర్థిక సంవత్సరాల మధ్య జరిగిన డిజిటల్ లావాదేవీల ఆధారంగానే నోటీసులు ఇస్తున్నామ‌ని చెప్పారు. ప్ర‌స్తుతం జీఎస్టీకి సంబంధించిన వివాదం కాద‌న్నారు. ఆన్‌లైన్ చెల్లింపులు రూ.20 లక్షలు, రూ.40 లక్షలు దాటిన వ్యాపారులకు మాత్ర‌మే నోటీసులు ఇస్తున్నామ‌న్నారు. చాలా మంది జీఎస్టీ ఎగ‌వేస్తున్నార‌ని వారు చెప్పారు. గ‌త నాలుగేళ్లలో కోట్ల‌ రూపాయ‌ల మేర‌కు టీ, కాఫీ విక్ర‌యాల‌పై లావాదేవీలు జ‌రిగాయ‌ని… కానీ.. జీఎస్టీ చెల్లింపులు రాలేద‌ని వారు చెబుతున్నారు. ఏదైనా ఉంటే కోర్టుకు వెళ్లే స్వేచ్ఛ వ్యాపారుల‌కు ఉంద‌ని పేర్కొన్నారు.

రంగంలోకి సీఎం..

ఈ వివాదం ముదురుతున్న నేప‌థ్యంలో క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ద‌రామ‌య్య నేరుగా రంగంలోకి దిగారు. కేంద్రంపై జీఎస్టీ విష‌యంలో పోరాడుతున్న నేప‌థ్యంలో ఆయ‌నే నేరుగా జోక్యం చేసుకోవ‌డం.. హుటాహుటిన స్పందించ‌డం గ‌మ‌నార్హం. వ్యాపార వ‌ర్గాల‌తో ఆయ‌న భేటీ అయ్యారు. వారికి ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌న్నారు. అయితే.. జీఎస్టీ వ‌సూళ్ల విష‌యంలో వాస్త‌వాలు తెలుసుకునేందుకు ఆర్థిక నిపుణుల‌తో ఒక క‌మిటీ నియ‌మించ‌నున్న‌ట్టు చెప్పారు. వ్యాపారాలు స‌జావుగా సాగాల‌ని.. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తున్నామ‌ని ఆయ‌న వివ‌రించారు.

This post was last modified on July 23, 2025 8:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

57 minutes ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

1 hour ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

1 hour ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

3 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

4 hours ago